సీఎం రాజీనామా.. ఉత్తరాఖండ్లో ప్రభుత్వం రద్దు

సీఎం రాజీనామా.. ఉత్తరాఖండ్లో ప్రభుత్వం రద్దు

ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ రాజీనామా చేశారు. కేబినెట్ మంత్రులతో కలిసి గవర్నర్ గుర్మీత్ సింగ్కు రాజీనామా పత్రాలు అందజేశారు. ఉత్తరాఖండ్లో బీజేపీ పార్టీ ఘన విజయం సాధించినప్పటికీ సంప్రదాయం ప్రకారం ప్రస్తుత ప్రభుత్వం రద్దు చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో సీఎం పుష్కర్ సింగ్..  మంత్రిమండలిని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. కొత్త ప్రభుత్వం కొలువు దీరే వరకు పదవిలో కొనసాగాలని గవర్నర్ చెప్పినట్లు పుష్కర్ సింగ్ వెల్లడించారు. 

ఉత్తరాఖండ్ లో 70 అసెంబ్లీ స్థానాలుండగా.. మేజిక్ ఫిగర్కు అవసరమైన సీట్ల కన్నా ఎక్కువ స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది. రాష్ట్రం ఏర్పడిన అనంతరం ఒక పార్టీ వరుసగా రెండుసార్లు అధికారంలోకి రావడం ఇదే తొలిసారి.  బీజేపీ 47స్థానాల్లో పాగా వేసి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. కాంగ్రెస్ 19 సీట్లతో సరిపెట్టుకుంది. పంజాబ్ లో ప్రభంజనం సృష్టిం ఆమ్ ఆద్మీ పార్టీ ఉత్తరాఖండ్ లో ఖాతా తెరవలేకపోయింది. ఇతరులు 4 స్థానాల్లో విజయం సాధించారు. ఇదిలా ఉంటే ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ ఈసారి ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రిగా ఎవరిని ప్రకటిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. 

For more news

డ్రగ్స్ కేసు విచారణ ఎందుకు అటకెక్కిందో చెప్పాలె 

అదేం నా సొంత ప్రసంగం కాదు