రైల్వే శాఖ దసరా బంపరాఫర్ : రైల్వేలో 8 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్

రైల్వే శాఖ దసరా బంపరాఫర్ : రైల్వేలో 8 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్

రైల్వే రిక్రూట్​మెంట్​బోర్డు నాన్– టెక్నికల్ పాపులర్​ కేటగిరీ(ఎన్​టీపీసీ)లో గ్రాడ్యుయేట్ లెవల్, అండర్ గ్రాడ్యుయేట్ లెవల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్​లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. ఈ నెల 21 నుంచి అప్లికేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది. 

ఎన్​టీపీసీ గ్రాడ్యుయేట్ లెవల్

పోస్టుల సంఖ్య: 5000. 

పోస్టులు: స్టేషన్ మాస్టర్ 615, గూడ్స్ ట్రైన్ మేనేజర్ 3423, ట్రాఫిక్ అసిస్టెంట్(మెట్రో రైల్వే) 59, చీఫ్ కమర్షియల్ కం టికెట్ సూపర్​వైజర్ (సీసీటీఎస్) 161, జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కం టైపిస్ట్ (జేఏఏ) 921, సీనియర్ క్లర్క్ కం టైపిస్ట్ 638. 

ALSO READ : టెన్త్, ఇంటర్ తో కానిస్టేబుల్ పోస్టులు.. మొత్తం 737 ఖాళీలు.. డ్రైవింగ్ వస్తే చాలు..

ఎలిజిబిలిటీ:  గుర్తింపు పొందిన బోర్డు లేదా సంస్థ నుంచి ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

వయోపరిమితి: 18 నుంచి 36 ఏండ్ల మధ్యలో ఉండాలి. నిబంధనలను అనుసరించి సంబంధిత వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా. 

అప్లికేషన్లు ప్రారంభం: అక్టోబర్ 21.  

లాస్ట్ డేట్: నవంబర్ 20. 

అప్లికేషన్ ఫీజు: ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్​మెన్, మహిళా అభ్యర్థులకు రూ.250. జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, అభ్యర్థులకు రూ.500. 

సెలెక్షన్ ప్రాసెస్: రెండు అంచెల్లో కంప్యూటర్ బేస్డ్​ టెస్ట్, స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

 

*అండర్ గ్రాడ్యుయేట్ లెవల్ 

పోస్టుల సంఖ్య: 3050. 

పోస్టులు: జూనియర్ కం టైపిస్ట్ 163, అకౌంట్స్ క్లర్క్ కం టైపిస్ట్ 394, ట్రైన్స్ క్లర్క్ 77, కమర్షియల్ కం టికెట్ క్లర్క్ 2424. 

ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన బోర్డు లేదా సంస్థ నుంచి 12వ తరగతిలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

వయోపరిమితి: 18 నుంచి 33 ఏండ్ల మధ్యలో ఉండాలి. నిబంధనలను అనుసరించి సంబంధిత వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా. 

అప్లికేషన్లు ప్రారంభం: అక్టోబర్ 21.  

లాస్ట్ డేట్: నవంబర్ 20. 

అప్లికేషన్ ఫీజు: ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్​మెన్, మహిళా అభ్యర్థులకు 250. జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, అభ్యర్థులకు రూ.500. 

సెలెక్షన్ ప్రాసెస్:  కంప్యూటర్ బేస్డ్​ టెస్ట్, స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

పూర్తి వివరాలకు www.rrbapply.gov.in వెబ్​సైట్​లో సంప్రదించగలరు.