పార్లమెంట్ లో ఆగని ఆందోళనలు

పార్లమెంట్ లో ఆగని ఆందోళనలు

పార్లమెంట్ ఉభయ సభలు వాయిదా పడ్డాయి. రాజ్యసభ సోమవారానికి, లోక్ సభ ఇవాళ మధ్యాహ్నం రెండు గంటలకు వాయిదా పడ్డాయి.  లిఖింపూర్ ఖేరి ఘటన ,సిట్ దర్యాప్తు నివేదిక పై చర్చ జరపాలని కాంగ్రెస్ సహా విపక్ష పార్టీల డిమాండ్ చేశాయి. వెంటనే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రాను మంత్రివర్గం నుంచి తొలగించాలని డిమాండ్ చేశాయి. కాంగ్రెస్ సహా విపక్షాల ఆందోళన నడుమ లోక్ సభలో ప్రశ్నోత్తరాలు చేపట్టారు. ప్రతిపక్షాల ఆందోళనలతో సభ నడపలేని పరిస్థితి నెలకొంది. అటు రాజ్యసభలో ప్రతిపక్ష ఎంపీల సస్పెన్షన్ పై కాంగ్రెస్ సహా విపక్షాలు నిరసనకు దిగాయి. దీంతో 12 మంది సభ్యుల సస్పెన్షన్‌పై అధికార-ప్రతిపక్షాలు చర్చించుకుని ఏకాభిప్రాయానికి రావాలని  చైర్మన్ వెంకయ్య నాయుడు సూచించారు. సభా కార్యాకలాపాలు సజావుగా జరిగేందుకు సభ్యులందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు.  రాజ్యసభను ఛైర్మన్ వెంకయ్య నాయుడు సోమవారానికి వాయిదా వేశారు.

ఇవికూడా చదవండి:

రేప్ ఎంజాయ్ చేయాలన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే

దేశ రాజధానిలో కొత్తగా 10 ఒమిక్రాన్ కేసులు