
ప్రముఖ గాయని లతా మంగేష్కర్ మృతికి రాజ్యసభ నివాళులర్పించింది. ఉదయం 10 గంటలకు సభ ప్రారంభమైన వెంటనే రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడు సంతాప సందేశం చదివారు. లతాజీ మరణంతో దేశం ఓ గొప్ప గాయకురాలిని, దయామూర్తిని, మహోన్నత వ్యక్తిత్వాన్ని కోల్పోయిందని, ఆమె మరణంతో ఒక శకం ముగిసిందని అన్నారు. సంగీత ప్రపంచంలో ఆమె లేని లోటు ఎన్నటికీ పూడ్చలేనిదని చెప్పారు. సంతాప సందేశం అనంతరం పెద్దల సభ సభ్యులు నిమిషం పాటు మౌనం పాటించారు. ఆ తర్వాత లతా మంగేష్కర్ గౌరవార్థం సభను గంట పాటు వాయిదా వేస్తున్నట్లు వెంకయ్య నాయుడు ప్రకటించారు.
Rajya Sabha Members observe a minute's silence as they pay tribute to the legendary singer #LataMangeshkar
— ANI (@ANI) February 7, 2022
House adjourned for one hour. pic.twitter.com/KaJyMuh8iX