వెంకీ, రానా కలయికలో వెబ్ సిరీస్‌  

వెంకీ, రానా కలయికలో వెబ్ సిరీస్‌  

హైదరాబాద్: దగ్గుబాటి ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్. విక్టరీ వెంకటేశ్, రానా కలసి ఎప్పుడు నటిస్తారా అని ఎదురు చూస్తున్న అభిమానులకు ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ బిగ్ న్యూస్ అందించింది. వెంకీ, రానాలతో ఓ వెబ్ సిరీస్‌కు ప్లాన్ చేసినట్లు నెట్‌ఫ్లిక్స్ ప్రకటించింది.  అమెరికన్ క్రైమ్ డ్రామా రే డొనొవాన్‌‌కు రీమేక్‌గా తెరకెక్కనున్న ఈ సిరీస్‌కు రానా నాయుడు అనే టైటిల్‌‌ను కన్ఫర్మ్ చేశారు. ఈ సిరీస్‌ను కరణ్ అన్షుమన్, సుపర్న్ వర్మలు డైరెక్ట్ చేయనున్నారు. ఇప్పటివరకు తమ కెరీర్లలో చేయనటువంటి పాత్రల్లో నటించబోతున్నట్లు ఈ సిరీస్‌ గురించి రానా తెలిపారు. ఇది తమకు ఛాలెంజింగ్ అని, షూటింగ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని చెప్పారు. రానాతో పని చేయడానికి తాను కూడా వెయిట్ చేస్తున్నానని.. రే డొనొవాన్ సిరీస్‌కు తాను పెద్ద ఫ్యాన్ అని వెంకీ పేర్కొన్నారు. 

Read More: 

‘రిపబ్లిక్’ రిలీజ్ డేట్, సాయి ధరమ్ హెల్త్‌పై చిరు ట్వీట్

శేఖర్ కమ్ముల నన్ను రిజెక్ట్ చేశాడు

సమస్యలపై ప్రశ్నించిన గ్రామస్తుడిని కాలితో తన్నిన సర్పంచ్

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Netflix India (@netflix_in)