రంగారెడ్డి జిల్లా మున్సిపల్ కమిషనర్ల బదిలీలు

రంగారెడ్డి జిల్లా మున్సిపల్ కమిషనర్ల బదిలీలు

రాష్ట్రంలో భారీగా మున్సిపల్‌‌ కమిషనర్లను ప్రభుత్వం బదిలీ చేసింది. 40 మంది మున్సిపల్‌ కమిషనర్లను బదిలీ చేస్తూ.. ప్రభుత్వం సోమవారం(ఫిబ్రవరి 12) రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు సొంత జిల్లాల్లో, 3 ఏళ్లకు పైగా ఒకే జిల్లాలో పనిచేస్తున్న వారిని బదిలీ చేసినట్లు ఆదేశాల్లో పేర్కొంది. 

ALSO READ :- పనుల విషయంలో ఎవర్ని ఉపేక్షించేది లేదు : సీతక్క

ఇందులో భాగంగా రంగారెడ్డి జిల్లా గండిపేట మండలంలోని రెండు మున్సిపాలిటీలలో కమిషనర్ లను బదిలీ చేశారు. కొడంగల్ మున్సిపాలిటీలో పని చేసిన ప్రవీణ్ కుమార్ రెడ్డిని అక్కడి నుంచి నార్సింగ్ కి ట్రాన్స్ ఫర్ చేశారు.  అలాగే మణికొండ మున్సిపల్ కొత్త కమిషనర్ గా ప్రదీప్ కుమార్ బదిలీ అయ్యారు. మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ భూత్పూర్ నుంచి ప్రదీప్ కుమార్ ను మణికొండ కమిషనర్‌‌గా బాధ్యతలు అప్పగించారు.