
కేసు విత్‌డ్రా చేసుకోనందుకే దాడి
రేప్ కేసును విత్‌డ్రా చేసుకోనందుకు బాధితురాలి కుటుంబంపై నిందితులు దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ దాడిలో గాయపడిన బాధితురాలి తల్లి వారం రోజులు మృత్యువుతో పోరాడి చివరకు ప్రాణాలు విడిచింది. నిందితులు, బాధితురాలి కుటుంబంపై దాడి చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరలయింది. బాధితురాలి కుటుంబంపై జనవరి 9న జరిగిన ఈ దాడి ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. ఐదుగురు వ్యక్తులు విచక్షణారహితంగా ఇద్దరు మహిళలపై దాడిచేయడం వీడియోలో రికార్డయింది. దాడిలో ఒక వ్యక్తి బాధితురాలి తల్లిని ముఖంపై కాలి బూటుతో తన్నడాన్ని కూడా చూడవచ్చు.
ఓ నేషనల్ సైట్ కథనం ప్రకారం..
ఉత్తర ప్రదేశ్, కాన్పూర్‌లో 2018లో ఒక బాలికపై మెహఫూజ్ మరియు బాబు అనే ఇద్దరు వ్యక్తులు ఎత్తుకెళ్లి అత్యాచారానికి ప్రయత్నించారు. వారిపై బాలిక తల్లిదండ్రులు ఫోక్సో చట్టం కింద కేసు పెట్టారు. దాంతో పోలీసులు వారిరువురిని అరెస్టు చేశారు. కొంతకాలం తర్వాత వారు బెయిల్‌పై విడుదలయ్యారు. కేసు విత్ డ్రా చేసుకోవాలంటూ బాధితురాలి కుటుంబాన్ని నిందితులు కోరారు. దానికి బాధితురాలి కుటుంబం ఒప్పుకోలేదు. దాంతో, పది రోజుల కిందట అంటే జనవరి 9న నిందితులు రోడ్డుపై వెళ్తున్న బాధితురాలి కుటుంబంపై రాళ్లు, కర్రలతో దాడి చేశారు. ఆ దాడిలో బాధితురాలి తల్లి మరియు ఆమె అత్త తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. అప్పటినుంచి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలి తల్లి, ఆరోగ్యం విషమించడంతో జనవరి 17, శుక్రవారం కన్నుమూశారు.
దాడి వీడియోపై స్పందించిన యూపీ పోలీసులు.. బాధితురాలి తల్లి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పంపినట్లు తెలిపారు. వీడియో ఆధారంగా ఇప్పటికే ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు వారు తెలిపారు. మరో ముగ్గురికోసం ప్రత్యేక బృందాల ద్వారా వెతుకుతున్నట్లు కాన్పూర్ డీఐజీ తెలిపారు. ఈ సంఘటన పోలీసుల నిర్లక్ష్యం వల్లే జరిగిందనే వాదనలపై స్పందించిన ఆయన.. దాడి వెనుక స్థానిక పోలీసుల పాత్రపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
ఈ సంఘటన ఉన్నవో రేప్ కేసును పోలి ఉంది. ఆ కేసుకు సంబంధించి బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సెంగెర్ కూడా ఆయన అత్యాచారం చేసిన బాలిక తండ్రిని కొట్టి చంపాడనే ఆరోపణలున్నాయి. ఆ తర్వాత బాధితురాలు సీఎం యోగి ఆదిత్యనాథ్ ఇంటి ముందు ఆత్మహత్యకు ప్రయత్నించింది. దాంతో కేసు మరింత తీవ్రంగా మారింది. నేరారోపణ బుజువుకావడంతో 2019 డిసెంబర్‌లో సెంగర్‌కు ఢిల్లీ కోర్టు జీవిత ఖైదు విధించింది.
A group of five men accused of molesting a young girl, who are currently out on bail, attacked the victim's mother after she refused to withdraw the case in Kanpur. The mother succumbed to injuries at the hospital. @myogiadityanath where is law and order in the state. @Uppolice pic.twitter.com/9FVO7TvCMX
— Saurabh Trivedi (@saurabh3vedi) January 17, 2020
For More News..