
హైదరాబాద్: ఎనర్జిటిక్ హీరో రామ్ తన తర్వాతి ప్రాజెక్టు పనుల్లో బిజీగా ఉన్నాడు. ఇటీవలే గాయం కారణంగా కొన్ని రోజులు షూటింగ్ కు దూరంగా ఉన్న ఈ ఇస్మార్ట్ హీరో.. ఇప్పుడు కోలుకుని, మళ్లీ షూట్ జాయిన్ అయ్యాడు. ఈ ప్రాజెక్టును ‘RAPO19’ అని పిలుస్తున్నారు. ఈ మూవీ టైటిల్ ను ‘వారియర్’గా మేకర్స్ ఫిక్స్ చేశారు. దీనికి సంబంధించిన పోస్టర్ ను తాజాగా రిలీజ్ చేశారు. ఇందులో పోలీసు ఆఫీసర్ గెటప్ లో రామ్ ఆకట్టుకున్నాడు. కోలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్లలో ఒకరు, ‘ఆవారా’ ఫేమ్ లింగుసామి తెరకెక్కిస్తున్న వారియర్ లో రామ్ సరసన కథానాయికగా కృతీ శెట్టి నటిస్తోంది. ఆది పిన్నిశెట్టి ప్రతినాయకుడిగా నటిస్తున్నాడు. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో దీన్ని తెరకెక్కిస్తున్నారు. ఫుల్ యాక్షన్ థ్రిల్లర్ గా, రామ్ ఫ్యాన్స్ తోపాటు సాధారణ ప్రేక్షకులను అలరించేలా మూవీని తీస్తున్నట్లు టాలీవుడ్ సమాచారం.
#RAPO19 is #??????????? ?#RAPO19FirstLook pic.twitter.com/dedw7G3SBD
— RAm POthineni (@ramsayz) January 17, 2022
మరిన్ని వార్తల కోసం: