నమ్మకాన్ని బిల్డ్​ చేసుకోవడం ఎలా?

నమ్మకాన్ని బిల్డ్​ చేసుకోవడం ఎలా?

ఎవరైనా డివోర్స్​ తీసుకుంటే... అయ్యో వాళ్లు విడిపోయారా? చిలకా గోరింకల్లా  చూడముచ్చటగా ఉండేవాళ్లు!’ అని బాధపడతారు. ‘వాళ్లది సిక్స్టీఇయర్స్ లవ్వట.. గ్రేట్ కదా!’ అని సర్​ప్రైజ్ ఫీల్ అవుతారు. మరి తొందరగా విడిపోవడానికి రీజన్ ఏంటి? వందేళ్లయినా విడిచి ఉండలేకపోవడానికి కారణం ఏంటి? అనడిగితే.. రెండింటికి ఒక్కటే  రీజన్... దాని పేరే నమ్మకం! అవును, నమ్మకం... రెండు మనసులను నడిపే పడవ లాంటిది.  

ఒకరిని ప్రేమిస్తున్నాం అంటే, వాళ్లను గౌరవించడం కూడా అందులో ఓ భాగమని గుర్తుంచుకోవాలి. మొక్కకు నీళ్లెంత ముఖ్యమో... ప్రేమకు గౌరవం కూడా అంతే ముఖ్యం. ఎదుటి వ్యక్తిని ఎంతగా గౌరవిస్తే... ప్రేమ కూడా అంతలా ఎదుగుతుంది.  

సెలబ్రిటీల నుంచి మామూలు మనుషుల వరకు  సొసైటీలో  రెండు రకాల రిలేషన్స్ చూస్తుంటాం. కొందరు విడిపోయేవాళ్లయితే, విడిచి ఉండలేని వాళ్లు ఇంకొందరు. విడిచి ఉండలేని వాళ్ల మధ్య ఏం ఉంటుందో తెలుసుకుంటే చాలు..  విడిపోయేవాళ్ల మధ్య ఏం లేదో అర్థమైపోతుంది. కష్టాలు,- నష్టాలు కలిసి పంచుకుంటూ కలకాలం కలిసి ఉండే హెల్దీ రిలేషన్​షిప్ టాప్ సీక్రెట్- నమ్మకం. ఇది రెండు మనసులను కలిపి ఉంచే గ్లూ లాంటిది! కానీ, ఇది గ్లూ లాగా కొనుక్కుంటే వచ్చేది మాత్రం కాదు. ఒకరి పట్ల ఒకరికి ఉండాల్సిన నమ్మకాన్ని ఎవరికి వాళ్లే ఏర్పరచుకోవాలి. అది కూడా రిలేషన్​షిప్​లో అడుగుపెట్టిన మొదటి రోజు నుంచే.

నమ్మకం అంటే?

పార్ట్​నర్​తో సెక్యూరిటీ, నిజాయితీ ఫీల్ అవ్వడమే రిలేషన్​షిప్​లో నమ్మకానికి డెఫినిషన్.  ఇది ఎదుటివ్యక్తి మీదే ఆధారపడి ఉంటుంది. వాళ్లు మనల్ని ఏ విషయంలోనూ ఇబ్బంది పెట్టరు. వాళ్లతో ఉన్నప్పుడు అసలైన ఫ్రీడం, సేఫ్టీ ఉంటుంది. ఒకవేళ రిలేషన్​షిప్​లో దీనికి ఆపోజిట్​గా ఉంటే... ఎవర్ని వాళ్లు ప్రొటెక్ట్ చేసుకోవాల్సిందే.

ఆ అవకాశం ఉంటుంది

రిలేషన్​లో నమ్మకం ఉన్నప్పుడు పార్ట్​నర్​తో ఇంకా ఓపెన్​గా ఉండటం, ఇంకా ఎక్కువ టైం ఇవ్వటానికి అవకాశం ఉంటుంది. నమ్మకం ఉంటే, చిన్న చిన్న మనస్పర్థలు వచ్చినప్పుడు కూడా ఎదుటివాళ్లను అర్థం చేసుకోవచ్చు. దానివల్ల తక్కువ టైంలోనే మేడ్ ఫర్​ ఈచ్​​ అదర్​గా మారిపోతారు. నమ్మకం ఉన్నప్పుడు పార్ట్​నర్​లో మంచినే చూసి,  ప్రాబ్లమ్ పై మాత్రమే ఫోకస్ పెడతారు. అంతేకానీ, ఆ వ్యక్తిని టార్గెట్​గా చేయరు. 

నమ్మకం ఉన్నచోట క్లోజ్​నెస్ పెరుగుతుంది. దాని వెంటే సేఫ్టీ నడిచొస్తుంది. అప్పుడు ‘ఏ దారి అయినా నా వెంట నా పార్ట్​నర్ ఉన్నారు’ అనే సపోర్ట్, కేర్ ఫీలవుతారు.  ఇద్దరి మధ్య నమ్మకం ఉండటం వల్ల నెర్వస్ సిస్టమ్ రిలాక్స్​డ్​గా ఉండటమే కాకుండా ఎప్పటికప్పుడు నెర్వస్ సిస్టమ్ పుంజుకుంటుందని చెప్తున్నాయి స్టడీలు.

నమ్మకాన్ని బిల్డ్​ చేసుకోవడం ఎలా?

ఒక్కొక్క ఇటుకను పేర్చి ఇల్లు కట్టినట్టుగానే నమ్మకాన్ని కూడా నెమ్మదిగా, ఓపికతో నిర్మించుకోవాల్సి ఉంటుంది. ఇది ఒక్క రోజులో అయ్యే పని కాదు. చాలా టైం పడుతుంది. మరి దాన్ని ఎలా ఏర్పరచుకోవాలంటే...

  •  తప్పు చేస్తారు, హర్ట్ చేస్తారు. కానీ, అదే తప్పుని మళ్లీ చేసి, మళ్లీ హర్ట్ చేయడం రిలేషన్​ని దెబ్బ తీస్తుంది. అందుకే పార్ట్​నర్​ని ఫిజికల్​గా, మెంటల్​గా ఇబ్బంది పెట్టకూడదు. తప్పు చేస్తే ఒప్పుకొని సారీ చెప్తే చులకనయ్యేది ఏమీ ఉండదని తెలుసుకోవాలి.
  •  మాటల్లో నిజాయితీ, ఉన్నదున్నట్లు మాట్లాడడం ఈ రెండూ రిలేషన్​లో నమ్మకాన్ని పెంచుతాయి. పార్ట్​నర్ ముందు దేన్నీ సీక్రెట్​గా ఉంచకూడదు. ఇద్దరి మనసులు అద్దంలాగ ఉండాలి. ఓపెన్ కమ్యూనికేషన్ వల్ల ప్రతి ప్రాబ్లమ్​ని డిస్కస్ చేసే ఫ్రీడం దొరుకుతుంది. దానివల్ల తమ ఫీలింగ్స్​ని బయటపెట్టడానికి భయపడరు.
  •  రిలేషన్​లో అడుగుపెట్టినప్పుడే  కలిసి ఎందుకు లైఫ్ జర్నీ చేయాలనుకుంటున్నారు? అనే ప్రశ్నకు ఇద్దరి దగ్గర సేమ్ రీజన్ ఉండాలి. ఇది రిలేషన్​కి పునాది లాంటిది.  
  •  ఎవరి స్పేస్​కి వాళ్లు సమానంగా ఇంపార్టెన్స్ ఇచ్చుకోవాలి. అలాగే, ఇద్దరూ కలిసి క్వాలిటీ టైం స్పెండ్ చేయాలి.   
  • మార్పు తప్పనిసరి అని గుర్తుంచుకోవాలి. ప్రేమలో పడ్డప్పుడు ఆ వ్యక్తి మనసు ఎలా ఉందో... అలాగే ఉండాలని గిరి గీయకూడదు. మార్పుని అంగీకరించాలి. మారడం మనిషి తత్వం. అందుకే మారడాన్ని సీరియస్​గా తీసుకోకూడదు.
  •  ఒకవేళ కమిట్​మెంట్స్, ప్రామిస్​లు చేసి ఉంటే వాటిని తప్పకుండా ఫాలో అవ్వాలి.
  • ఎదుటి వ్యక్తి ఏదైనా చెప్తుంటే సానుభూతితో వినడం అలవాటు చేసుకోవాలి. పార్ట్​నర్​తో ఉన్నప్పుడు ప్రజెంట్ మూమెంట్​లో ఉండాలి. మనిషి ఇక్కడ, మనసు ఎక్కడో అన్నట్టు ఉండకూడదు. పార్ట్​నర్​ని బాగా అర్థం చేసుకోవడానికి క్వశ్చన్స్ అడగాలి.
  • పార్ట్​నర్​తో పంచుకునే ఆలోచనలు, ఎమోషన్స్, అవసరాలు, రిక్వెస్ట్​లలో నిజాయితీ ఉండాలి.
  •  ఎంత ప్రయత్నించినా గొడవలు మరీ ఎక్కువగా ఉంటే థెరపిస్ట్ లేదా సైకాలజిస్టుని కలవాలి.
  • నమ్మకం లేకపోవడం వల్లే నెగెటివిటీ, గొడవలు, డిప్రెషన్, యాంగ్జైయిటీ లాంటి సమస్యలు వస్తాయి. చివరికి అవే డివోర్స్​కి దారి తీస్తాయి. అందుకే నమ్మకం రిలేషన్​కి పిల్లర్ అంటారు!  
  • అందుకే రిలేషన్​లో అడుగు పెట్టేటప్పుడే... మనసుని దాని గురించి నమ్మకంగా అడగాలి!

నమ్మకం లేకుంటే..

నమ్మకం లేని రిలేషన్​షిప్​లో కొన్ని సిగ్నల్స్ కనపడుతుంటాయి. అవేంటంటే... పార్ట్​నర్ పదేపదే ప్రామిస్​లు చేస్తూ, కమిట్​మెంట్స్ ఇస్తూ మిస్ చేస్తుంటారు. రిలేషన్ షిప్​లో క్లోజ్​నెస్​ తగ్గిపోతుంది. ఫిజికల్​గా, ఎమోషనల్​గా దూరంగా ఉంటుంటారు. ఏం జరిగినా పార్ట్​నర్ మీదికే నెగెటివిటీ మోసుకెళ్తుంటారు. చీటికిమాటికి కోప్పడుతుంటారు. ఇన్ సెక్యూరిటీ ఫీలవుతూ పార్ట్​నర్ మీద అనుమానం పెంచుకుంటారు. అవసరం లేకున్నా అదేపనిగా కాల్ చేయడం, మెసేజ్ చేయడం కూడా రిలేషన్​లో నమ్మకం లేకపోవడం వల్లే జరుగుతుంది. అవతలి వ్యక్తి ఏం చేస్తున్నారో, ఏం ఆలోచిస్తున్నారో అని ప్రతి నిమిషం ఆలోచిస్తూ ఉంటారు. అవసరమైనప్పుడు మనతో పార్ట్​నర్ ఉంటారో , లేరో అనే భయం. దాని తాలూకు ఒంటరితనం, డిప్రెషన్​తో బాధ పడుతుంటారు. ఇలాంటి వన్నీ రిలేషన్​లో నమ్మకం లేనప్పుడే ఉంటాయి.