రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు రూ.922 కోట్ల ట్యాక్స్ నోటీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు రూ.922 కోట్ల ట్యాక్స్ నోటీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

న్యూఢిల్లీ: రూ.922.58 కోట్ల జీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టీ కట్టాలని రిలయన్స్ క్యాపిటల్ సబ్సిడరీ  రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌జీఐసీ) కు డైరక్టరేట్ జనరల్ ఆఫ్​ జీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టీ ఇంటెలిజన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ షోకాజ్ నోటీసులు పంపింది. రూ.478.84 కోట్లు , రూ. 359.70 కోట్లు, రూ.78.66 కోట్లు, రూ.5.38 కోట్లు  కట్టాలని నాలుగు షోకాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నోటీసులు  పంపింది.  రీ–ఇన్సూరెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, కో–ఇన్సూరెన్స్ వంటి  సర్వీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లపై వచ్చే రెవెన్యూపై ఈ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు. సెప్టెంబర్ క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రిజల్ట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఈ అమౌంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కంటింజెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లయబిలిటీగా కంపెనీ ఆడిటర్లు చూపాలని  ట్యాక్స్ అధికారులు చెబుతున్నారు. 

ప్రస్తుతం ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌జీఐసీ ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టీలో  డెట్ రిజల్యూషన్ ప్రాసెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఎదుర్కొంటోంది. రిలయన్స్ క్యాపిటల్ మొత్తం వాల్యూలో ఈ ఒక్క కంపెనీ వాటానే 70 శాతం ఉంది. ఇండియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌,  ఫారిన్ రీఇన్సూరెన్స్ కంపెనీలకు  రీ–ఇన్సూరెన్స్ సర్వీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను అందించడం ద్వారా వచ్చిన కమీషన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై రూ.478.84 కోట్ల జీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టీ పడింది. ఇది కట్టాలని జీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టీ అధికారులు కంపెనీకి ఈ ఏడాది సెప్టెంబర్ 28 న నోటీసులు పంపారు. కో–ఇన్సూరెన్స్ ట్రాన్సాక్షన్లపై అందుకున్న ప్రీమియంలపై రూ.359.70 కోట్ల జీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టీ కట్టాలని షోకాజ్ నోటీసులు ఇష్యూ చేశారు. 

జులై 1, 2017 నుంచి మార్చి 31, 2022 మధ్య ఎటువంటి సర్వీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు అందించకుండా రూ.78.66 కోట్ల ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ఐటీసీ)  తీసుకుందని జీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టీ అధికారులు తెలిపారు. దీనికి సంబంధించి మూడో నోటీసును కంపెనీ అందుకుంది.