అమ్మకానికి రిలయన్స్ నేవల్‌‌

అమ్మకానికి రిలయన్స్ నేవల్‌‌

ఈఓఐను కోరుతోన్న లెండర్లు
ఆఖరు తేదీ వచ్చే నెల 17

ముంబై: అనిల్ అంబానీ గ్రూప్‌‌‌‌కి చెందిన రిలయన్స్ నావల్‌‌‌‌ అండ్ ఇంజనీరింగ్ లిమిటెడ్‌‌‌‌ అమ్మకం కోసం లెండర్లు కొనుగోలుదారుల నుంచి ఎక్స్‌‌‌‌ప్రెషన్స్ ఆఫ్ ఇంటరస్ట్(ఈఓఐ) కోరుతున్నారు. ఇన్‌‌‌‌సాల్వెన్సీ అండ్ బ్యాంక్‌‌‌‌రప్టసీ కోడ్ కింద దివాలా తీసిన ఈ షిప్‌‌‌‌బిల్డర్‌‌‌‌‌‌‌‌ను కొనుగోలు చేయాలని లెండర్లు కోరుతున్నారు. ఆర్‌‌‌‌‌‌‌‌కామ్ తర్వాత ఇన్‌‌‌‌సాల్వెన్సీలోకి వెళ్లిన రెండో రిలయన్స్ గ్రూప్ కంపెనీ ఇది. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌‌‌‌కు చెందిన అహ్మదాబాద్ బెంచ్ ఈ ఏడాది జనవరి 15న రిలయన్స్ నావల్‌‌‌‌‌‌‌‌పై ఇన్‌‌‌‌సాల్వెన్సీ చర్యలకు అనుమతి ఇచ్చింది. రిలయన్స్ నావల్‌‌‌‌‌‌‌‌ను ఐడీబీఐ బ్యాంక్‌‌‌‌ దివాలా కోర్టులోకి  లాగింది. ఆ తర్వాత 16 నెలలకు ఈ తీర్పు చెప్పింది.

ఐడీబీఐకు రిలయన్స్ నావల్‌‌‌‌ రూ.1,159.43 కోట్లను చెల్లించాల్సి ఉంది. మొత్తంగా రూ.9,492 కోట్ల రుణాలను కట్టకుండా తాము దివాలా తీసినట్టు స్టాక్ ఎక్స్చేంజీలకు అనిల్ అంబానీ గ్రూప్ కంపెనీ  రిలయన్స్ నావల్‌‌‌‌ జనవరిలోనే తెలిపింది. ఈఓఐలను సమర్పించేందుకు చివరి తేదీ వచ్చే నెల 17గా ఉంది. ప్రాస్పెక్టివ్ రిజల్యూషన్ అప్లికెంట్ల తుది జాబితాను జూలై 17న జారీ చేస్తారు. రిజల్యూషన్ ప్లాన్ సబ్‌‌‌‌మిట్ చేయడానికి ఆగస్ట్ 6 వరకు సమయం ఉంటుంది. ఈ ప్లాన్‌‌‌‌ను ఆమోదించేందుకు సెప్టెంబర్ 5న బ్యాంక్‌‌‌‌రప్టసీ కోర్టుకు పంపించనున్నారు.  కంపెనీ వద్ద సరిపడా క్యాష్ ఫ్లో లేకపోవడంతో, ప్రస్తుత ప్రాజెక్ట్‌‌‌‌ల డెడ్‌‌‌‌లైన్స్‌‌‌‌ను పొడిగించుకుంటూ వెళ్లింది. దీంతో క్లయింట్స్ విశ్వాసం దెబ్బతింది. కంపెనీకి కొత్త ఆర్డర్లు రావడం తగ్గిపోయింది. 2013 నుంచి రిలయన్స్ నావల్​ ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటోంది. 2015లో అనిల్ అంబానీ గ్రూప్ దీన్ని కొనుగోలు చేసింది.

మరిన్ని వార్తల కోసం

ఉద్యోగం పోతే ఈఎంఐ రద్దు

11 అంకెల సెల్ ఫోన్ నెంబర్లు రాబోతున్నాయి

కరోనా కన్నా రాక్షసం ఈ మనుషులు..