ఈ-ఓటింగ్ తో క్వారంటైన్ లోని ఓటర్లకు,వృద్ధులకు ఓటు హక్కు

ఈ-ఓటింగ్ తో క్వారంటైన్ లోని ఓటర్లకు,వృద్ధులకు ఓటు హక్కు

త్వరలో జరగనున్నGHMC ఎన్నికల్లో అందరూ తమ ఓటు హక్కును వినియోగించుకునేలా చర్యలు చేపట్టింది రాష్ట్ర ఎన్నికల కమిషన్. GHMC పరిధిలో ఓటు ఉండి ఎన్నికల విధులకు హాజరయ్యే ప్రభుత్వ సిబ్బందికి, కరోనాతో క్వారంటైన్ లో ఉన్న ఓటర్లకు, వయో వృద్ధులకు ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పించేందుకు నిర్ణయించారు ఎన్నికల కమిషనర్ సి. పార్ధసారధి. దీనికి సంబంధించి ఈ-ఓటింగ్ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది.

సాంకేతిక అంశాలను, ఈ-ఓటింగ్ ద్వారా ఓటు వేయడానికి రిజిస్టర్ చేసుకునే విధానాన్ని, ఓటింగ్ గోప్యత  నిబంధనలు పాటిస్తూ ఆన్లైన్లో ఓటు వేసే విధానంపై ఐటి శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్.. సిబ్బంది తో పాటు సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ అధికారులతో రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయంలో చర్చించారు. సాధ్యమైనంత త్వరలో నిబంధనలు పాటిస్తూ సాఫ్ట్ వేర్ ను పొందుపరిచి డెమో ఇవ్వాల్సిందిగా సూచించారు.

అలాగే GHMC ఎన్నికల తర్వాత ఈ-ఓటింగ్ విధానం అమలు, అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని రాబోవు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పోరేషన్, ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికలలో విస్తృత స్థాయిలో ఈ-ఓటింగ్ విధానాన్ని అమలు చేసే ఆలోచనలో రాష్ట్ర ఎన్నికల సంఘం ఉన్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ తెలిపారు.