
వరుస సినిమాలు చేస్తూ కెరీర్‌లో జెట్ స్పీడ్‌తో దూసుకెళ్తోంది సమంత. హీరోయిన్‌గానే కాక, స్పెషల్ సాంగ్స్‌తో, లేడీ ఓరియెంటెడ్ మూవీస్‌తోనూ సత్తా చాటుతోంది. ఆమె లీడ్ రోల్‌లో నటిస్తున్న చిత్రాల్లో ‘యశోద’ ఒకటి. హరి – హరిష్ రూపొందిస్తున్న ఈ సినిమాని శ్రీదేవి మూవీస్ బ్యానర్‌పై శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మిస్తున్నారు. వరలక్ష్మి శరత్‌కుమార్, ఉన్ని ముకుందన్, రావు రమేష్, మురళీ శర్మ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆల్రెడీ షూటింగ్ స్టార్ట్ చేసిన ఈ చిత్రం కోసం హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోస్‌లో భారీ సెట్‌ను నిర్మించారు. మూడు కోట్ల రూపాయలతో వేసిన సెట్‌లో ప్రస్తుతం షూటింగ్ జరుగుతోంది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ ‘ఈ సినిమాను పెద్ద హోటల్‌లో షూట్ చేయాల్సి ఉంది. అయితే సుమారు నలభై రోజుల పాటు హోటల్‌లో షూట్ అంటే సులభమైన విషయం కాదు. అందుకే సీనియర్ ఆర్ట్ డైరెక్టర్ అశోక్‌తో భారీ హోటల్ సెట్‌ను రూపొందించాం. ఇందులో డైనింగ్ హాల్, లివింగ్ రూమ్, కాన్ఫరెన్స్ హాల్, లైబ్రరీ సహా సెవెన్ స్టార్ హోటల్‌లో ఉండే సౌకర్యాలను తలపించేలా ఏడెనిమిది సెట్స్ వేశాం. ఫిబ్రవరి 3న మొదలైన ఈ షెడ్యూల్ ప్రస్తుతం అక్కడే జరుగుతోంది. సమంతతో పాటు ముఖ్య నటులతో కీలక సీన్స్ తెరకెక్కిస్తున్నాం. క్లైమాక్స్‌ను కొడైకెనాల్‌లో ప్లాన్ చేశాం. ఏప్రిల్ నెలాఖరులోపు షూటింగ్ పూర్తి చేయాలనుకుంటున్నాం. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఒకేసారి విడుదల చేస్తాం’ అని చెప్పారు.