
అవును ఇవి చందమామ బూట్లే. అలా అని జాబిలి మీదకు వెళ్లేందుకు వేసుకునేవి కాదు. కానప్పుడు ఈ పాత బూట్లకు 3 కోట్లా అని అనుకోవద్దు. వాటికీ స్పెషాలిటీ ఉంది. 1972 ఒలింపిక్స్ ట్రయల్స్ కోసం చందమామ కాన్సెప్ట్‌తో వాటిని నైకీ ఓనర్ బిల్ బోవర్‌మాన్ తయారు చేయించారు. అది కూడా ఓ 12 జతలే. వాటిలో ఇప్పుడు కొన్ని మాత్రమే ఉన్నాయి. అందుకే వీటిని అరుదైన షూగా చెబుతుంటారు. వాటిలో ఇదీ ఒక జత. ఆ బూట్లను న్యూయార్క్‌లోని ఆన్లైన్ వేలం సంస్థ సోథెబీ వేలం వేసింది. కెనడా రాజధాని టొరంటోకు చెందిన మైల్స్ నదాల్ అనే వ్యాపారి వాటిని సుమారు ₹3.02 కోట్లకు (4,37,500 డాలర్లు) దక్కించుకున్నాడు. వాటిని తీసుకెళ్లి తన ‘డేర్ టు డ్రీమ్ ఆటోమొబైల్ మ్యూజియం’లో ప్రదర్శనకు పెడతాడట. ఆ మ్యూజియంలో ఇప్పటివరకు అతడు సేకరించిన చాలా పాత మోడల్, కొత్త మోడల్ కార్లను ప్రదర్శిస్తుంటాడు నదాల్. అంతకుముందు వారం క్రితం మరిన్ని అరుదైన షూలను ఆన్లైన్లో వేలం వేసింది సోథెబీ. వాటినీ నదాలే చేజిక్కించుకున్నాడు. సుమారు 5.86 కోట్లకు (8.5 లక్షల డాలర్లు) వాటిని వేలంలో పాడుకున్నాడు.