
లోకంలో డబ్బకు విలువ పెరుగుతుంది కానీ, మనిషికి.. మనిషి ప్రాణానికి మాత్రం ఎటువంటి విలువ లేకుండాపోతోంది. వందలు, వేలు, లక్షల కోసం మనిషిని చంపిన సంఘటనలు మనం చూశాం. కానీ, కేవలం రూ. 5ల కోసం మనిషిని చంపిన సంఘటన ముంబాయిలో జరిగింది.
రామ్‌దులార్ సింగ్ యాదవ్ అనే వ్యక్తి మంగళవారం సాయంత్రం బోరివాలి ఈస్ట్‌లోని మగథనే గ్యాస్ స్టేషన్‌కు వెళ్లాడు. అక్కడ తన వాహనంలో సీఎన్‌జీ ఫిల్ చేయించుకొని గ్యాస్ స్టేషన్ వర్కర్‌కి డబ్బులు చెల్లించాడు. యాదవ్ తనకు రావాలసిన మిగతా రూ. 5 ల చిల్లర ఇవ్వాలని అడిగాడు. దాంతో కోపోద్రిక్తుడైన గ్యాస్ స్టేషన్ వర్కర్ యాదవ్‌ను దుర్భాషలాడాడు. ఇద్దరి మధ్య జరిగిన గొడవ కొట్టుకునేవరకు వచ్చింది. దాంతో గ్యాస్ స్టేషన్‌లో పనిచేస్తున్న మిగతా వర్కర్లు కూడా అక్కడికి వచ్చి యాదవ్‌ను తీవ్రంగా కొట్టారు. తీవ్ర గాయాలైన యాదవ్ ఎలాగో అలాగా అక్కడినుంచి ఇంటికి చేరుకున్నాడు. దాడిలో గాయపడ్డ యాదవ్ బుధవారం తెల్లవారుజామున పరిస్థితి విషమించడంతో మృతిచెందాడు. దాంతో యాదవ్ కుమారుడు సంతోష్ యాదవ్ కస్తూర్బా రోడ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు వెంటనే నిందితులందరినీ పట్టుకొని అరెస్టు చేశారు. మృతుడు రామ్‌దులార్ సింగ్ యాదవ్ పాల్ఘర్ జిల్లా, నలసోపార నివాసి.
For More News..