జోక్యం చేసుకోని ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఐ!

జోక్యం చేసుకోని ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఐ!
  • రూపాయి పతనం ఆగదా!
  • బ్యాంకింగ్ సిస్టమ్‌‌‌‌‌‌‌‌లో తగ్గుతున్న లిక్విడిటీ
  • జోక్యం చేసుకోని ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఐ!
  • మరింత పడొచ్చంటున్న  నిపుణులు

బిజినెస్‌‌‌‌‌‌‌‌ డెస్క్‌‌‌‌‌‌‌‌, వెలుగు: డాలర్ మారకంలో రూపాయి పతనం కొనసాగుతోంది. ఫెడ్ వడ్డీ రేట్లు పెంచడంతో యూఎస్ బాండ్ ఈల్డ్‌‌‌‌‌‌‌‌లు (రాబడి) కొన్నేళ్ల గరిష్టానికి చేరుకున్నాయి. డాలర్ వాల్యూ కూడా బలపడుతోంది. ఫలితంగా రూపాయి విలువ కొత్త కనిష్టాలకు పడుతోంది. రూపాయి పతనాన్ని ఆపేందుకు ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఐ  జోక్యం చేసుకోవడం లేదు. దీంతో డాలర్ మారకంలో రూపాయి పతనం షార్ట్ టెర్మ్‌‌‌‌‌‌‌‌లో మరింత ఉండొచ్చని ఫారెక్స్‌‌‌‌‌‌‌‌ ఎనలిస్టులు చెబుతున్నారు.  మిగిలిన కరెన్సీలతో పోలిస్తే ఇప్పటి వరకు  డాలర్ మారకంలో  మంచి పెర్ఫార్మెన్స్ చేసిన రూపాయి  గురువారం ఒక్క సెషన్‌‌‌‌‌‌‌‌లోనే 99 పైసలు నష్టపోయింది. శుక్రవారం సెషన్‌‌‌‌‌‌‌‌లో మరో 41 పైసలు తగ్గి 81.22 వద్ద ఆల్‌‌‌‌‌‌‌‌టైమ్ కనిష్టాన్ని నమోదు చేసింది. చివరికి 13 పైసల లాస్‌‌‌‌‌‌‌‌తో 80.99 వద్ద సెషన్‌‌ను ముగించింది. 

ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఐ జోక్యం చేసుకోవాలి

మరోవైపు రూపాయి పతనాన్ని ఆపేందుకు ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఐ జోక్యం చేసుకోవాలని ఫారెక్స్ ట్రేడర్లు కోరుతున్నారు. కిందటేడాది  ఏప్రిల్ తర్వాత నుంచి చూస్తే డాలర్ మారకంలో రూపాయి విలువ ఈ వారమే ఎక్కువగా తగ్గిందని, ఈ వారం 1.6 శాతం పడిందని వివరిస్తున్నారు. ఇందులో కూడా మెజార్టీ నష్టం  గత రెండు సెషన్లలోనే వచ్చిందని పేర్కొన్నారు.  ‘80.97 లెవెల్ దగ్గర  అమ్మకాల ఒత్తిడి ఎక్కువగా వచ్చి ఉండొచ్చు. సాధారణంగా వారంలోని చివరి సెషన్‌‌‌‌‌‌‌‌లో రూపాయి పతనాన్ని ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఐ  ఆపడమో లేదా ఇన్‌‌‌‌‌‌‌‌ఫ్లోస్‌‌‌‌‌‌‌‌ ఎక్కువగా రావడమో ఉంటుంది’ అని కాస్మోస్‌‌‌‌‌‌‌‌ బ్యాంక్‌‌‌‌‌‌‌‌ చీఫ్ మేనేజర్ (ట్రెజరీ, ఫారెక్స్‌‌‌‌‌‌‌‌)  ఆశిష్‌‌‌‌‌‌‌‌ రనడే అన్నారు.  మొత్తంగా చూస్తే  రూపాయి పతనాన్ని ఆపడం ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఐకి అంత ఈజీ కాదని, డాలర్ మారకంలో రూపాయి ఇక 80.75–81.25 రేంజ్‌‌‌‌‌‌‌‌లో కదలాడొచ్చని అంచనావేశారు. డాలర్ మారకంలో రూపాయికి 81.25 వద్ద స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉండొచ్చని  అన్నారు. 

పెద్ద సవాలే..

డాలర్ వాల్యూని బట్టి రూపాయి విలువ అడ్జెస్ట్ అవ్వడానికి ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఐ అవకాశం ఇవ్వాలని, జోక్యం చేసుకోకూడదని ఫారెక్స్ నిపుణులు సలహాయిస్తున్నారు. వడ్డీ రేట్లను హయ్యర్ లెవెల్స్‌‌‌‌‌‌‌‌లోనే ఫెడ్ కొనసాగించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి   ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఐ జోక్యం ఉన్నా పెద్దగా ఫలితం లేకపోవచ్చని అంటున్నారు. ‘డాలర్ మారకంలో రూపాయి పతనాన్ని ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఐ  ఆపకపోవడానికి  ఒక కారణం బ్యాంకింగ్ సిస్టమ్‌‌‌‌‌‌‌‌లో తగినంత లిక్విడిటీ (క్యాష్‌‌‌‌‌‌‌‌) లేకపోవడం. ప్రస్తుతం బ్యాంకింగ్ సిస్టమ్‌‌‌‌‌‌‌‌లో లిక్విడిటీ  తగినంతగా లేదు. షార్ట్‌‌‌‌‌‌‌‌ టెర్మ్‌‌‌‌‌‌‌‌ రేట్లు పెరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో రూపాయి పతనాన్ని ఆపడానికి ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఐ జోక్యం చేసుకుంటే పరిస్థితులు మరింత అధ్వాన్నంగా మారొచ్చు’ అని సీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫారెక్స్ అడ్వైజర్స్ పేర్కొంది.

రెండేళ్ల కనిష్టానికి ఫారెక్స్ నిల్వలు..

దేశ ఫారెక్స్ నిల్వలు వరసగా ఏడో వారం కూడా తగ్గి ఈ నెల 16 నాటికి 545.652 బిలియన్ డాలర్లుగా రికార్డయ్యాయి. అక్టోబర్ 2, 2020 నుంచి ఈ లెవెల్ కంటే కిందకు ఫారెక్స్ నిల్వలు  రాలేదు. ఈ నెల 9 తో ముగిసిన వారానికి ఫారెక్స్‌‌‌‌‌‌‌‌ నిల్వలు 550.871 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ఈ లెవెల్‌‌‌‌‌‌‌‌తో పోలిస్తే ఈ నెల 16 నాటికి ఫారెక్స్ నిల్వలు  5.219 బిలియన్ డాలర్లు తగ్గాయి. డాలర్ వాల్యూ పెరగడంతో మారిన వాల్యుయేషన్‌‌‌‌‌‌‌‌ వలన ఫారెక్స్ నిల్వలు తగ్గుతున్నాయని ఎనలిస్టులు చెబుతున్నారు.