షెడ్యూల్డ్​ కులాల సంక్షేమ యంత్రాంగం

షెడ్యూల్డ్​ కులాల సంక్షేమ యంత్రాంగం

షెడ్యూల్డ్​ కులాల సంక్షేమం: బ్రిటీష్ వారు విభజించు, పాలించు విధానం ద్వారా తమ పరిపాలనకు సవాల్​ విసురుతున్న తెగలు, దళితులను మిగతా సమాజం నుంచి విభజించే నేపథ్యంలో 1874లో షెడ్యూల్డ్​ జిల్లాల చట్టాన్ని రూపొందించారు. 1927లో సైమన్​ కమిషన్​ షెడ్యూల్డ్​ కులం అనే పదాన్ని మొదటిసారిగా వాడింది. బ్రిటీష్​ పాలనలో వీరిని అణగారిన వర్గాలుగా పిలిచేవారు. 1935 భారత ప్రభుత్వ చట్టంలో షెడ్యూల్డ్​ కులం అనే పదాన్ని అధికారికంగా వాడారు. కేంద్ర ప్రభుత్వం భారత రాజ్యాంగ షెడ్యూల్డ్​ కులాల ఉత్తర్వు ద్వారా షెడ్యూల్డ్​ కులాల పూర్తి జాబితాను విడుదల చేసింది.

ఆర్టికల్​ 164: షెడ్యూల్డ్​ జాతులు, వెనుకబడిన వర్గాల సంక్షేమం కోసం జార్ఖండ్​, చత్తీస్​గఢ్​, మధ్యప్రదేశ్​, ఒడిశా రాష్ట్రాల్లో ప్రత్యేక అదనపు బాధ్యతతో మంత్రిని నియమించాలి. 
ఆర్టికల్​ 275: వివిధ రాష్ట్రాల ఎస్సీ, ఎస్టీల సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలుకు అవసరమైన నిధులను కేంద్ర ప్రభుత్వం సహాయంగా చెల్లించాలి. 
ఆర్టికల్ 335: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్​. 
ఆర్టికల్ 330: షెడ్యూల్డ్​ కులాలకు లోక్​సభలో రిజర్వేషన్​. 
ఆర్టికల్​ 332: షెడ్యూల్డ్​ కులాలకు రాష్ట్ర శాసనసభలో రిజర్వేషన్​. 
ఆర్టికల్​ 334: రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పటి నుంచి 10 సంవత్సరాలకు ఒకసారి రిజర్వేషన్​ కాలపరిమితిని పెంచడం. 
ఆర్టికల్​ 338: ఎస్సీ, ఎస్టీల కోసం జాతీయ కమిషన్​ను రాష్ట్రపతి నియమిస్తాడు. 
ఆర్టికల్​ 339: షెడ్యూల్డ్​ ప్రాంతాల పరిపాలన, షెడ్యూల్డ్​ తెగల సంక్షేమంపై ప్రభుత్వ నియంత్రణ.
ఆర్టికల్​ 341: ఎస్సీ, ఎస్టీలను గుర్తించే, తొలగించే, సవరించే అధికారం పార్లమెంట్​కు ఉంది. 
మహిళా సంక్షేమం: 1985లో మహిళలు, పిల్లల అభివృద్ధికి విడిగా ఒక విభాగాన్ని మానవ వనరుల మంత్రిత్వశాఖలో ఏర్పాటు చేశారు. ఫలితంగా 1985లో సాంఘిక స్త్రీ సంక్షేమ విభాగం ఏర్పాటైంది. 2006 లో ప్రత్యేకంగా మహిళలు, శిశువులకు మంత్రిత్వశాఖ ఏర్పాటైంది. ఇది దేశంలో మహిళలు, పిల్లల అభివృద్ధికి నోడల్​ ఏజెన్సీ, అత్యున్నత స్థాయి సంస్థ. 2001 సంవత్సరాన్ని మహిళా సాధికారత సంవత్సరంగా నిర్వహించారు. 
ఆర్టికల్​ 23: వెట్టిచాకిరి, దేవదాసీ వ్యవస్థ నిషేధం. 
ఆర్టికల్​ 39 (ఎ): మహిళలు, పురుషుల జీవనోపాధి రక్షణలో సమానత్వాన్ని పాటించడానికి రాజ్యం విధానాలను రూపొందించాలి. 
ఆర్టికల్​​ 39 (డి): స్త్రీ, పురుషులకు సమాన పనికి సమాన వేతనం. 
 ఆర్టికల్ 39 (ఇ): చిన్న పిల్లలను బలవంతంగా పనిలో పెట్టడం నిషేధం.
ఆర్టికల్ 39 (ఎఫ్​): పిల్లలు ఆరోగ్యకరంగా, స్వేచ్ఛగా, గౌరవ మర్యాదలతో పెరగడానికి కావాల్సిన అవసరాలను, సౌకర్యాలను ఏర్పాటు చేయాలి. 
ఆర్టికల్ 42: మాతాశిశు సంక్షేమానికి ప్రత్యేక సౌకర్యాల కల్పన.
ఆర్టికల్​ 47: ఆరోగ్యం, పోషక విలువల పెంపుదలపై రాజ్యం కృషి చేస్తుంది. 
ఆర్టికల్ 51ఎ(ఇ): మహిళల గౌరవ మర్యాదలకు భంగం కలగరాదు. 
ఆర్టికల్ 243(డి)(3): స్థానిక సంస్థల పంచాయతీ ఎన్నికల్లో మహిళలకు రిజర్వేషన్​ కల్పించాలి.
ఆర్టికల్ 243 (డి) (4): పంచాయతీల చైరపర్సన్​ పదవుల మొత్తంలో మూడొంతులకు తగ్గకుండా ప్రతి స్థాయిలోనూ మహిళలకు కేటాయించాలి.
ఆర్టికల్ 243 (టీ) (3): నగరపాలక సంస్థల పంచాయతీ ఎన్నికల్లో మహిళలకు రిజర్వేషన్స్​ కల్పించాలి.
ఆర్టికల్ 243 (టీ) (4): నగరపాలక చైర్​పర్సన్​ పదవుల్లో రిజర్వేషన్లను షెడ్యూల్డ్​ కులాలు, తెగల మహిళలకు ఆయా రాష్ట్రాల శాసనసభలు రూపొందించిన చట్టాల ఆధారంగా జరగాలి. 
బాలల సంక్షేమం: యూఎన్​సీఆర్​సీ (యునైటెడ్​ నేషన్స్​ కన్వెన్షన్​ ఆన్​ ది రైట్స్​ ఆఫ్​ ది చైల్డ్​) ఆర్టికల్​ 1 ప్రకారం 18 సంవత్సరాల లోపు వారందరూ బాలలే. ఈ కన్వెన్షన్ పైన 1992లో భారత్​ సంతకం చేసింది. దీని ప్రకారం చిన్న పిల్లల​ అమ్మకం, చిన్న పిల్లలపై లైంగిక దాడులు, పోర్నోగ్రఫీని నిషేధించాలి. నిర్భయ ఘటన దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఆర్డినెన్స్​ ప్రకారం బాలలు అంటే 16 సంవత్సరాల లోపు వారే. బాల కార్మికుల చట్టం (1986) ప్రకారం 14 సంవత్సరాల లోపు వారు బాలలు. బాలల న్యాయ సవరణ చట్టం (2015) ప్రకారం 16 సంవత్సరాల లోపు అందరూ బాలలే. 

ఆర్టికల్​ 21: వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించకుండా ఉండటం.
ఆర్టికల్​ 21(ఎ): 6 నుంచి 14 సంవత్సరాల బాలబాలికలందరికీ ఉచిత, నిర్బంధ ప్రాథమిక విద్యా హక్కు.
ఆర్టికల్ 23: మానవ అక్రమ రవాణా, కట్టుబానిసత్వం నిషేధం.
ఆర్టికల్​ 24: 14 సంవత్సరాల లోపు వయస్సు గల బాలలు ఫ్యాక్టరీలు, గనుల్లో ఇతర ప్రమాదకర పరిస్థితుల్లో పనిచేయడం నిషేధం.
ఆర్టికల్​ 25 – 28: విశ్వాస స్వేచ్ఛను, మతాన్ని నమ్మడం, ఆచరించడం, ప్రచారం తదితర విషయాల్లో స్వేచ్ఛను తెలుపుతాయి.
ఆర్టికల్ 45: 6 –14 సంవత్సరాల బాల్య దశపై శ్రద్ధ, విద్యను రాజ్యమే అందిస్తుంది.
ఆర్టికల్​ 46: సామాజిక న్యాయం, అన్ని రకాల దోపిడీ నుంచి రాజ్యమే రక్షణ కల్పిస్తుంది.

మైనార్టీల సంక్షేమం: రాజ్యాంగంలో ఎక్కడా మైనార్టీ అనే పదాన్ని నిర్వచించలేదు. దేశ జనాభా, సంఖ్యలో తక్కువ శాతం ఉన్న వర్గాలను మైనార్టీలుగా పిలువవచ్చు. జాతీయ మైనార్టీల హక్కుల దినోత్సవంగా డిసెంబర్​ 18ను 1992లో మొదటిసారి ప్రకటించారు. మైనార్టీ హక్కుల కోసం యూఎన్​ఓ 1992, డిసెంబర్​ 18న జాతీయ లేదా జాతిపరమైన, మతపరమైన, భాషాపరమైన హక్కుల ప్రకటన చేసింది.

ఆర్టికల్​ 25: ఒక వ్యక్తి తన అంతరాత్మ ప్రబోధం మేరకు ఏ మతాన్నైనా స్వీకరించవచ్చు. ప్రచారం చేసుకోవచ్చు. సిక్కు జాతీయులు కృపాణం ధరించడానికి, అలంకరించడానికి గల హక్కు.
ఆర్టికల్​ 26: తమ మత పటిష్టత కోసం మత సంస్థలు ప్రత్యేక ఏర్పాట్లు చేసుకోవచ్చు. 
ఆర్టికల్​ 27: మత సంస్థల ఆదాయంపైన పన్నులు విధించరాదు. 
ఆర్టికల్​ 28: మతం ఆధారంగా ప్రభుత్వ విద్యాలయాల్లో మత ప్రచారం చేయరాదు. 
ఆర్టికల్ 29: మైనార్టీల ప్రయోజనాల పరిరక్షణ.
ఆర్టికల్​ 29(1): దేశంలో నివసించే పౌరులు ఒక విశిష్టమైన భాషను, సొంత లిపిని లేదా సొంత సంస్కృతిని కాపాడుకోవచ్చు. 
ఆర్టికల్​ 29(2): ప్రభుత్వ విద్యాలయాల్లో గానీ, ప్రభుత్వ నిధుల నుంచి ఆర్థిక సాయం పొందే విద్యాలయాల్లో గానీ కుల, మత, జాతి, భాషాపరమైన భేదం చూపరాదు. 
ఆర్టికల్​ 30: మతపరమైన అల్పసంఖ్యాక వర్గాలు లేదా భాషాపరమైన అల్పసంఖ్యాక వర్గాల వారు అనే భేదం లేకుండా విద్యాసంస్థలను ఏర్పాటు చేసుకోవచ్చు. 
ఆర్టికల్​ 30(1): మత లేదా భాషా ప్రాతిపదికపై ఏర్పడిన అల్ప సంఖ్యాక వర్గాలకు చెందిన ప్రజలు తమ అభీష్టం మేరకు విద్యా సంస్థలను స్థాపించుకొని నిర్వహించుకోవచ్చు. 
ఆర్టికల్​ 30(2): ప్రభుత్వం విద్యా సంస్థలకు ఆర్థిక సాయం అందజేసేటప్పుడు కొన్ని విద్యాసంస్థలు మతపరమైన, భాషాపరమైన మైనార్టీల యాజమాన్య నిర్వహణలో ఉన్నప్పుడు వాటి పట్ల ప్రభుత్వం వివక్ష చూపరాదు. 

ఆర్టికల్​ 38(2): దేశంలో ఆయా ప్రాంతాల్లో నివసిస్తున్న, వివిధ వృత్తులు నిర్వహిస్తున్న అనేక మంది వ్యక్తులు, సమూహాల మధ్య స్థాయిలో సదుపాయాల్లో అవకాశాల్లో అసమానతలను నిర్మూలించాల్సిన బాధ్యత రాజ్యంపైన ఉంటుంది. 

ఆర్టికల్​ 46: బలహీన వర్గాల వారి అభివృద్ధికి రిజర్వేషన్లు కల్పించాలి.
అధికరణ 350(ఎ): బాలలకు మాతృభాషలోనే విద్యాబోధన కల్పించడం.
అధికరణం 350(బి): భాషాపరమైన అల్పసంఖ్యాక వర్గాల ప్రయోజనాల పరిరక్షణకు ప్రత్యేక అధికారిని రాష్ట్రపతి నియమించాలి.