భారీగా పతనమైన స్టాక్ మార్కెట్లు

భారీగా పతనమైన స్టాక్ మార్కెట్లు

స్టాక్ మార్కెట్లపై బేర్ పంజా విసిరింది. వారంలో తొలి ట్రేడింగ్ సెషన్ లోనే దేశీయ మార్కెట్లు భారీ నష్టాలు చవి చూశాయి. చిన్నా, పెద్దా తేడా లేకుండా అన్ని సూచీల షేర్లు నష్టాలు మూటగట్టుకున్నాయి. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ లో ట్రేడవుతున్న 3,844 కంపెనీల షేర్లలో 875 లోయర్ సర్క్యూట్ ను తాకాయి. ఫలితంగా ఇన్వెస్టర్ల లక్షల కోట్ల సంపద ఆవిరైపోయింది.
రష్యా, ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతలు, కరోనా కేసులు పెరుగుతుండటం, ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్లు మార్చే అవకాశముండటం ఇంటర్నేషనల్ మార్కెట్లపై ప్రభావం చూపింది. దీనికి తోడు ఆసియా మార్కెట్ల పతనం దేశీయ ఇన్వెస్టర్లలో ఆందోళన పెంచింది. ఫలితంగా ఇన్వెస్టర్లు అమ్మకాలకు మొగ్గుచూపారు. ప్రీ బడ్జెట్ కరెక్షన్ సైతం మార్కెట్ల నష్టాలను మరింత పెంచింది.
ఉదయం 59,023.97 పాయింట్ల వద్ద ప్రారంభమైన మార్కెట్ లో ప్రారంభస్థాయే ఇవాళ్టి గరిష్ఠ స్థాయి. అమ్మకాల ఒత్తిడితో ఒకదశలో 2వేల పాయింట్ల కోల్పోయి 56,984పాయింట్ల కనిష్ఠానికి పతనమైన మార్కెట్ ఆ తర్వాత కాస్త కోలుకుంది. 1546 పాయింట్ల నష్టంతో 57,49.51 వద్ద క్లోజయింది. బీఎస్ఈ 30లో ఏ ఒక్క షేర్ లాభపడలేదు. బా కంపెనీల షేర్లన్నీ 2 నుంచి 5శాతం వరకు నష్టపోయాయి. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ నిఫ్టీ కూడా నష్టాలను మూటగట్టుకుంది. 503.60 పాయింట్ల లాస్ తో 17,113.55 వద్ద క్లోజయింది.

For more news


రిపబ్లిక్ పరేడ్ లో వారికి అనుమతి లేదు

కరోనా బారినపడ్డ శరద్ పవార్