ఆమెకు ‘క్లైమేట్​ చేంజ్​’ జబ్బు

ఆమెకు ‘క్లైమేట్​ చేంజ్​’ జబ్బు
  • ప్రపంచంలోనే తొలి కేసు కెనడాలో నమోదు

న్యూఢిల్లీ: వాతావరణ మార్పులతో అనారోగ్యం బారినపడ్డ తొలికేసు కెనడాలో నమోదైంది. ఇప్పటికే చాలా వ్యాధులతో సతమతమవుతున్న ఓ 70 ఏండ్ల మహిళలో క్లైమేట్​ చేంజ్​వల్ల ఆ హెల్త్​ ప్రాబ్లమ్స్ మరింత తీవ్రమైనట్టు డాక్టర్లు గుర్తించారు. ఈ ఏడాదిలో వరుసగా విజృంభించిన హీట్​వేవ్స్​వల్ల పేషెంట్​ఆరోగ్యం క్షీణించిందని ఆమెకు ట్రీట్​మెంట్​చేసిన బ్రిటిష్​ కొలంబియాలోని హాస్పిటల్ ​డాక్టర్లు చెప్పారు. కెనడా, అమెరికాల్లోని కొన్ని ప్రాంతాల్లో హీట్​వేవ్స్ పెరగడంతో ఈ ఏడాది వందలాది మంది చనిపోయారు. కెనడాలోని ఒక్క బ్రిటిష్​ కొలంబియా ప్రావిన్స్​లోనే 233 మంది మరణించారు. చాలామందికి డయాబెటిస్, గుండెపోటు, ఉబ్బసం వంటి సమస్యలు తలెత్తాయి. 

హాస్పిటళ్లకు పేషెంట్ల తాకిడి పెరగడంతో..

కెనడా, అమెరికాల్లో ఈ ఏడాది వేడి గాలులు విపరీతంగా పెరిగాయి. దీంతో ప్రావిన్స్​లోని హాస్పిటల్స్​కు పేషెంట్ల తాకిడి ఎక్కువైంది. ఎక్కువ మంది ఎండ దెబ్బతో, ఇతర హెల్త్​ ప్రాబ్లమ్స్​తో ఆస్పత్రులకు క్యూ కట్టారు. ఇలా ఒకేసారి హాస్పిటళ్లపై ఒత్తిడి పెరగడంతో ఏమయ్యుంటుందోనని డాక్టర్లు ఆరా తీశారు. హీట్​వేవ్స్ వల్లే ఇలాంటి ఇబ్బందులు పెరగలేదని, ఈ మధ్య వరుసగా అడవుల్లో కార్చిచ్చులు చెలరేగి చాలా మందికి ఆరోగ్యం క్షీణిస్తూ వస్తోందని గుర్తించారు. కార్చిచ్చుల వల్ల పార్టిక్యులేట్​ మ్యాటర్(పీఎం) 2.5 స్థాయి వాతావరణంలో పెరగడంతో ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు ఎక్కువయ్యాయని కనుగొన్నారు. రోగ లక్షణాలతో పాటు వాటికి కారణాలను గుర్తించి చెప్పినప్పుడే పనికి న్యాయం చేసినవాళ్లమవుతామని డాక్టర్లు చెప్పారు. ప్రావిన్స్ లో డాక్టర్లు, నర్సులు, హెల్త్​కేర్​ప్రొఫెషనల్స్​ 40 మంది కలిసి ఓ గ్రూప్​గా ఏర్పడ్డారు. వాతావరణ మార్పుల వల్ల కలిగే దారుణాల గురించి ప్రజలకు వివరించడం స్టార్ట్​ చేశారు.