
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న అంతర్జాతీయ సంస్థ సింప్లిజిత్ గ్రూప్, అరేబియన్ కన్స్ట్రక్షన్ కంపెనీ (ఏసీసీ) ఇండియాలో మెజారిటీ వాటాను కొనుగోలు చేస్తున్నట్లు ప్రకటించింది. దీనిద్వారా సింప్లిజిత్ భారీస్థాయి మౌలిక సదుపాయాలు, రియల్ ఎస్టేట్, ఉత్పత్తుల ట్రేడింగ్, బ్రాండింగ్, కమ్యూనికేషన్స్ రంగాల్లోకి ప్రవేశిస్తుంది.
ప్రీమియం రెసిడెన్షియల్, వాణిజ్య మౌలిక సదుపాయాల ప్రాజెక్టులపై దృష్టి సారిస్తుంది. ఏసీసీ నిర్మాణ అనుభవం, సింప్లిజిత్ ఆర్థిక పటిమ, అంతర్జాతీయ భాగస్వామ్యాల నెట్వర్క్ వల్ల మేలు జరుగుతుందని ఈ గ్రూప్ ఎండీ అభిజిత్ జయంతి అన్నారు. ఏసీసీ ఆర్డర్ పైప్లైన్ రూ. 2,500 కోట్లు దాటిందన్నారు.