చిన్న కూటములు ప్రపంచాన్ని శాసించలేవ్

చిన్న కూటములు ప్రపంచాన్ని శాసించలేవ్

కార్బిస్ బే, ఇంగ్లండ్: చిన్న కూటములతో ప్రపంచాన్ని శాసించలేరని చైనా పేర్కొంది. అత్యంత శక్తిమంతమైన దేశాల కూటమి జీ7ను ఉద్దేశించి డ్రాగన్ కంట్రీ ఈ వ్యాఖ్యలు చేసింది. తన ఆధిపత్యాన్ని కట్టడి చేయాలని భావిస్తోన్న జీ7 దేశాలపై చైనా ఘాటుగా స్పందించింది. ‘ప్రపంచ దేశాలకు చెందిన కీలక నిర్ణయాలను చిన్న కూటములు కలసి తీసుకునే రోజులు ముగిసిపోయాయి. చిన్న, పెద్ద, బలహీన, బలమైన, పేద, ధనిక అన్ని దేశాలు సమానమేనని మేం నమ్ముతాం. అందుకే ప్రపంచానికి సంబంధించిన నిర్ణయాలను అన్ని దేశాలతో చర్చించి, సంప్రదించి తీసుకోవాలి’ అని లండన్‌లో చైనా అధికార ప్రతినిధి పేర్కొన్నారు. చైనా పెత్తనానికి అడ్డుకట్ట వేసేందుకు అమెరికా, కెనడా, బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్, జపాన్‌లు కలసి జీ7 కూటమిగా ఏర్పడ్డాయి.