నిజామాబాద్, వెలుగు: కొవిడ్ కారణంగా పసుపు వినియోగం పెరిగిందని, పసుపు లాభాలను ప్రచారం చేస్తే డిమాండ్మరింత పెరుగుతుందని ఎంపీ ధర్మపురి అర్వింద్స్పైసెస్బోర్డును కోరారు. పసుపు ఎగుమతి అవుతున్న దేశాల్లోనూ స్థానిక భాషల్లో ప్రచారం చేయాలని మినిస్ట్రీ ఆఫ్కామర్స్కు లెటర్రాసినట్లు చెప్పారు. స్పైసెస్బోర్డు ఆధ్వర్యంలో వర్చువల్ గా శనివారం కొనుగోలుదారులు, రైతులతో సమావేశం నిర్వహించారు. మీటింగ్లో అర్వింద్ మాట్లాడుతూ ఈ సమావేశాలు అమ్మకం, కొనుగోలుదారుల మధ్య వారధిలా పని చేస్తాయన్నారు. పసుపు పంట చేతికొచ్చే సమయంలో మార్కెట్ లింకేజీ ఏర్పడుతుందని చెప్పారు. పసుపు పంటకు పేరుగాంచిన సాంగ్లీ మార్కెట్ వరకు రైలు నడపడానికి రైల్వే శాఖ రెడీగా ఉందన్నారు. నిజామాబాద్ లో కర్కుమిన్ శాతాన్ని కొలిచే యంత్రం ఏర్పాటుతో సత్ఫలితాలు సాధించినట్లు చెప్పారు. ఈ కేంద్రం ద్వారానే ఇప్పటివరకు 123 ఎక్స్ పోర్ట్ లైసెన్సులు జారీ చేయడం శుభ పరిణామమన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో పసుపు రైతులకు సబ్సిడీతో 160 పాలిషర్లు , 66 బాయిలర్లు అందించారని, 4,140 టార్పాలిన్ షీట్లు రెడీగా ఉన్నాయని, రైతులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని కోరారు. సమావేశంలో స్పైసెస్బోర్డు డైరెక్టర్లు బీఎన్ఝా, వెంకటేశన్, తెలంగాణ హార్టికల్చర్ డైరెక్టర్ వెంకట్ రామ్ రెడ్డి , నిజామాబాద్, వరంగల్ రీజినల్ ఆఫీస్డిప్యూటీ డైరెక్టర్లు సుందరేషన్, లింగప్ప తదితరులు పాల్గొన్నారు.
