డ్రగ్స్‌ కేసులో లంక క్రికెటర్‌ అరెస్ట్

డ్రగ్స్‌ కేసులో లంక క్రికెటర్‌ అరెస్ట్

కొలంబో: శ్రీలంక ఇంటర్నేషనల్‌‌ క్రికెటర్‌ ఒకరు డ్రగ్స్‌‌ కేసులో అరెస్ట్‌‌ అయ్యాడు. పేసర్‌ షెహన్‌ ముదషనక(25) అక్రమంగా హెరాయిన్‌ తరలిస్తూ ఆదివారం స్థానిక పోలీసులకు దొరికాడు. 2018 జనవరిలో బంగ్లాదేశ్‌ తో జరిగిన వన్డేతో ఇంటర్నేషనల్‌‌ క్రికెట్‌ లో అడుగుపెట్టిన షనక ఆ మ్యాచ్‌ లో హ్యాట్రిక్‌‌ తీసి సంచలనం సృష్టించాడు. అయితే డ్రగ్స్‌‌ కేసులో పట్టుబడడంతో మేజిస్ట్రేట్‌ ఆదేశాల మేరకు రెండు వారాల రిమాండ్‌ కు తరలించినట్టు సోమవారం అక్కడి అధికారులు తెలిపారు.

ప్రస్తుతం శ్రీలంక వ్యాప్తంగా లాక్‌‌డౌన్‌, కరోనా వైరస్‌‌ కర్ఫ్యూ అమలులో ఉంది. అయితే మరో వ్యక్తితో కలిసి కారులో ప్రయాణిస్తున్న షనకను పన్నాల పట్టణం వద్ద పోలీసులు ఆదివారం ఆపారు. తనిఖీ చేయగా షనక వద్ద రెండు గ్రాములకు పైగా హెరాయిన్‌ ఉన్నట్లు గుర్తించారు. దాంతో , అతనిడి అరెస్ట్ చేశారు.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఒక్క మర్డర్ దాచడం కోసం 9 హత్యలు చేశాడు

V6 ఛానెల్ చొరవతో బెంగళూరు నుండి స్వ‌గ్రామానికి త‌ల్లీకూతుళ్లు 

నెటిజన్లు ఫిదా : బర్రె పగ తీర్చుకుంది.. ఆకతాయిల నడుం ఇరకొట్టింది