చూపే బంగారమాయెనే శ్రీవల్లి.. మాటే మాణిక్యమాయెనే..

V6 Velugu Posted on Oct 13, 2021

సుకుమార్ డైరెక్షన్ లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా పుష్ప సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. బన్నీ సరసన రష్మిక హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ నుంచి శ్రీ వల్లీ అనే లిరికల్ సాంగ్ రిలీజైంది. చూపే బంగారమాయెనే  శ్రీవల్లి.. మాటే మాణిక్యమాయెనే అనే సాంగ్ అందరినీ ఆకట్టకుంటుంది. పల్లెటూరి గెటప్స్ లో అల్లు అర్జున్, రష్మిక కనిపించారు.  ఈ సాంగ్‌ ను సిద్ శ్రీరామ్ పాడగా, రాక్ స్టార్ దేవీశ్రీప్రసాద్ మ్యూజిక్ అందించాడు.   ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన అల్లు అర్జున్ పుష్ప రాజ్, రష్మికల శ్రీవల్లి లుక్స్ అందరినీ బాగా ఆకట్టుకున్నాయి.  అలాగే దాక్కో దాక్కో మేక సాంగ్ సినిమాపై బాగానే అంచనాలను పెంచేసింది. ఈ క్రమంలో ఇప్పుడు చూపె బంగారమాయేనే శ్రీవల్లి.. అంటూ సాగే లిరికల్ సాగ్‌ తో సినిమాపై అంచనాలన మరింత పెంచాయంటున్నారు ఫ్యాన్స్. ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల కానున్న సంగతి తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్, ముత్యంశెట్టి మీడియా సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. మొదటి భాగం పుష్ప ది రైస్ డిసెంబర్ 17న 5 భాషలలో భారీ స్థాయిలో విడుదల చేయనున్నట్టు ఆల్రెడీ మేకర్స్ అఫీషియల్‌ గా తెలిపారు.

 

మరిన్ని వార్తల కోసం:

పాము కాటుతో భార్యను చంపిన భర్తకు రెండు జీవిత కాలాల శిక్ష

కబడ్డీ ఆడుతున్న బాలికను ఎత్తుకెళ్లి చంపేశారు

సావర్కర్‌ను జాతిపిత చేస్తారేమో?: అసదుద్దీన్ ఒవైసీ

Tagged pushpa, , srivalli, lyrical video

Latest Videos

Subscribe Now

More News