మొబైల్ కంపెనీలకు సూపర్​ ఆఫర్

మొబైల్ కంపెనీలకు సూపర్​ ఆఫర్

రూ.50 వేల కోట్ల ఎలక్ట్రానిక్ ఇన్సెంటివ్ స్కీంలు
అప్లికేషన్లను ఆహ్వానిస్తున్న ప్రభుత్వం

న్యూఢిల్లీ: రూ.50 వేల కోట్ల ఎలక్ట్రానిక్ ఇన్సెంటివ్ స్కీమ్‌‌‌‌ల కోసం ప్రభుత్వం అప్లికేషన్లను ఆహ్వానిస్తోంది. ఎలక్ట్రానిక్ మాన్యుఫాక్చరింగ్‌‌‌‌లో గ్లోబల్ మొబైల్ డివైజ్ తయారీదారులను ఆకట్టుకోవడానికి, లోకల్ కంపెనీలకు బూస్టప్ ఇవ్వడానికి ప్రభుత్వం ఈ స్కీమ్‌‌‌‌లను తీసుకొచ్చింది. టాప్ 5 గ్లోబల్ మొబైల్ మాన్యుఫాక్చరింగ్ కంపెనీలను ఆకట్టుకోవడమే లక్ష్యంగా, టాప్ 5 లోకల్ కంపెనీలను ప్రమోట్ చేసేందుకు తాము ఈ స్కీమ్‌‌‌‌లు తీసుకొచ్చినట్టు ఐటీ, టెలికాం మంత్రి రవి శంకర్ ప్రసాద్ తెలిపారు. వీరిని స్క్రీనింగ్ ప్రాసెస్ ద్వారా గుర్తించనున్నట్టు పేర్కొన్నారు. గ్లోబల్ మొబైల్ మార్కెట్‌‌‌‌లో 80 శాతం టాప్ 5–6 పెద్ద కంపెనీలే ఆక్రమించుకుని ఉన్నాయి. పీఎల్‌‌‌‌ఐ స్కీమ్ కింద తొలుత టాప్ 5 గ్లోబల్ ఛాంపియన్లను తాము ఆకట్టుకోనున్నామని రవి శంకర్ చెప్పారు. గ్లోబల్‌‌‌‌కంపెనీలు, లోకల్ కంపెనీలు కలిసి ఇండియాను మంచి తయారీ దేశంగా మార్చాలని, గ్లోబల్ చెయిన్‌‌‌‌కు సపోర్ట్ ఇవ్వాలని కోరారు. ఐదు ఇండియా కంపెనీలను కూడా తాము ప్రమోట్ చేయనున్నామని, ఇవి నేషనల్ ఛాంపియన్లుగా మారనున్నాయని రవి శంకర్ తెలిపారు. ఎలక్ట్రానిక్స్ ప్రమోషన్ కోసం ప్రభుత్వం ఏప్రిల్ 1న మూడు స్కీమ్‌‌‌‌లను నోటిఫై చేసింది. ఈ స్కీమ్‌‌‌‌లు ఎలక్ట్రానిక్ కాంపోనెంట్లు, సెమీ కండక్టర్లు, మోడిఫైడ్ ఎలక్ట్రానిక్స్ మాన్యుఫాక్చరింగ్ క్లస్టర్స్‌‌‌‌తయారీకి సంబంధించినవి. ప్రొడక్షన్‌‌‌‌తో లింక్‌‌‌‌అయిన ఇన్సెంటివ్ స్కీమ్‌‌‌‌పెద్ద తరహా ఎలక్ట్రానిక్స్ మాన్యుఫాక్చరింగ్‌‌‌‌కు సంబంధించినది. ఈ స్కీమ్‌‌‌‌లు మంగళవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఇక కంపెనీలు అప్లికేషన్లను సబ్‌‌‌‌మిట్ చేయొచ్చని ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ సెక్రటరీ అజయ్ ప్రకాశ్ సాహ్నీ అన్నారు. గ్లోబల్ మొబైల్ మేజర్స్ వచ్చే రెండు లేదా మూడేళ్లలో ఇండియాకు వస్తాయని నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ తెలిపారు. ఈ సెగ్మెంట్‌‌‌‌లో ఇండియన్ నెంబర్ వన్‌‌‌‌గా నిలువనుందని పేర్కొన్నారు.

For More News..

ఈ నెల 15లోగా ఇంటర్ ఫలితాలు

ఈ నెల నుంచి కొత్త కరెంట్ బిల్లులు