తమిళనాడులో ఉనికి కోసమే విపక్షాల ఆరాటం

తమిళనాడులో ఉనికి కోసమే విపక్షాల ఆరాటం

తమిళనాడులో శాంతి భద్రతలు నెలకొనడంతో రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వస్తున్నాయని సీఎం స్టాలిన్ చెప్పారు.  విపక్ష నేతలు పళని స్వామి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై అభివృద్ధిని చూసి ఓర్వలేకపోతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో శాంతి భద్రలు క్షీణిస్తున్నాయని ప్రభుత్వంపై విపక్ష నేతలు ఆరోపణలు చేయడం సరికాదన్నారు. డీఎంకే అధికారంలోకి వచ్చిన తర్వాత గంజాయి విక్రయాలు. .రాష్ట్రంలో నేరాలు పెరిగిపోయాయని ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పార్టీ నేత బాల చంద్రన్ హత్య తర్వాత స్టాలిన్ పై అన్నామలై తీవ్ర విమర్శలు చేశారు. సీఎం కొడుకు సినిమా చూసేందుకు స్టాలిన్ కు సమయం దొరుకుతుంది కానీ రాష్ట్రంలో శాంతి భద్రతలపై సమీక్ష నిర్వహించేందుకు టైం దొరకడం లేదా అని ప్రశ్నించారు. దీనిపై స్టాలిన్ మాట్లాడుతూ విపక్ష నేతలు తమ ఉనికిని చాటుకునేందుకు ప్రభుత్వంపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. డీఎంకే అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో అల్లర్లు, తుపాకీ కాల్పులు, నేరాలు కంట్రోల్లో ఉన్నాయన్నారు. అందుకే తమిళనాడు పెట్టుబడులను ఆకర్షిస్తోందన్నారు. రాష్ట్రంలో ప్రశాంత వాతావరణం నెలకొందనడానికి ఇదే నిదర్శనమని సీఎం స్టాలిన్ చెప్పారు. 

మరిన్ని వార్తల కోసం

 

'లాల్ సింగ్ చద్ధా'ను వెంటాడుతున్న ఆమీర్ వ్యాఖ్యలు

ట్రాఫిక్​ పోలీసుల నిర్వాకం.. పసికందు మృతి