లోయలో పడ్డ టీచర్ల బస్సు.. 10 మంది మృతి

లోయలో పడ్డ టీచర్ల బస్సు.. 10 మంది మృతి

క్యూబాలో దారుణం జరిగింది. టీచర్లతో వెళ్తున్న బస్సు లోయలో పడటంతో 10 మంది టీచర్లు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో 24 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన వెస్ట్ హవానాకు 40 కిలోమీటర్ల దూరంలో శనివారం జరిగింది. హవానాలో టీచర్ల కొరత ఎక్కువగా ఉండటంతో.. వందలాది మంది హవానాకు వెళ్లి టీచర్లుగా పనిచేస్తున్నారు. అయితే వీరిలో 45 మంది టీచర్లు శనివారం వారి స్వస్థలమైన తూర్పు క్యూబాకు బస్సులో వస్తున్నారు. వీరు ప్రయాణిస్తున్న బస్సు అదుపుతప్పి లోయలో పడటంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. హవానాలో టీచర్లు ఉంటున్న క్వార్టర్లు కోవిడ్-19 షెల్టర్లుగా మార్చడంతో వీరు క్యూబాకు పయనమయ్యారు. ఈ ఘటనలో గాయపడిన వారిని మాయాబెక్ ప్రావిన్స్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

చనిపోయిన వారి కుటుంబాలకు క్యూబా అధ్యక్షుడు మిగ్యుల్ డియాజ్-కానెల్ సంతాపం వ్యక్తం చేశారు. ‘10 మంది టీచర్లు ప్రాణాలు కోల్పోయినందకు చాలా బాధగా ఉంది. మరణించిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి’ అని ట్వీట్ చేశారు.

For More News..

సీట్లు ఫుల్ చేసుకోవడానికి థియేటర్లకు గ్రీన్ సిగ్నల్

ఇంజనీరింగ్ స్టూడెంట్లకు క్లాసుల్లేవ్.. ఓన్లీ ల్యాబులే

తల్లి శవాన్ని పదేళ్లు ఫ్రిజ్‌​లో దాచిన కూతురు