రెడీ ఫర్​ టెట్.. టెట్ నోటిఫికేషన్​ రిలీజ్​

రెడీ ఫర్​ టెట్.. టెట్ నోటిఫికేషన్​ రిలీజ్​

తెలంగాణ సర్కార్​ టీచర్​ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో  టెట్ నోటిఫికేషన్​ రిలీజ్​ చేసింది.  టెట్‌‌‌‌‌‌‌‌ కేవలం అర్హత పరీక్ష మాత్రమే కాదు. పోటీ పరీక్ష కూడా. గురుకుల/ టీచర్స్‌‌‌‌‌‌‌‌ రిక్రూట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ టెస్ట్‌‌‌‌‌‌‌‌ (టీఆర్​టీ)లో 20 శాతం మార్కులు వెయిటేజి ఇస్తారు. గతంలో టెట్‌‌‌‌‌‌‌‌ రాసిన అభ్యర్థులు మార్కులు పెంచుకోవడం కోసం మళ్లీ రాస్తున్నారు. టెట్‌‌‌‌‌‌‌‌లో క్వాలిఫై అవడంతో పాటు మంచి స్కోర్​ ఎలా సాధించాలి, ప్రిపరేషన్​ ప్లాన్, ఎగ్జామ్​ ప్యాటర్న్​ గురించి తెలుసుకుందాం..

  • తెలంగాణ ఏర్పడిన తర్వాత 2016, 17, 22 సంవత్సరాల్లో టెట్‌‌‌‌‌‌‌‌ నిర్వహించారు. తాజాగా ఇది నాలుగోసారి. అయితే 2017లో మాత్రమే టీచర్ల నియామక పరీక్ష నిర్వహించారు. ఇందులో 8,700 మంది అర్హత సాధిస్తే, 2020లో 8 వేలమందికి టీచర్‌‌‌‌‌‌‌‌ పోస్టులు ఇచ్చారు. ఇప్పటివరకు రాష్ట్రంలో టెట్‌‌‌‌‌‌‌‌ అర్హత సాధించినవారు 4,19,030 మంది ఉన్నారు.  
  • విద్యాహక్కు చట్టం ప్రకారం సెక్షన్‌‌‌‌‌‌‌‌ 23(1) నేషనల్‌‌‌‌‌‌‌‌ కౌన్సిల్‌‌‌‌‌‌‌‌ ఫర్‌‌‌‌‌‌‌‌ టీచర్‌‌‌‌‌‌‌‌ ఎడ్యుకేషన్‌‌‌‌‌‌‌‌ నిర్దేశించిన ప్రమాణాల ప్రకారం.. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ఉపాధ్యాయులుగా పనిచేయాలంటే టీచర్‌‌‌‌‌‌‌‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌‌‌‌‌‌‌‌ (టెట్‌‌‌‌‌‌‌‌)లో అర్హత పొందడం తప్పనిసరి.
  • టెట్‌‌‌‌‌‌‌‌ అర్హత:  ఇంటర్​ తర్వాత డిప్లొమా ఇన్‌‌‌‌‌‌‌‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌‌‌‌‌‌‌‌ పూర్తిచేసినవారు టెట్‌‌‌‌‌‌‌‌ పేపర్‌‌‌‌‌‌‌‌-–1 పాసవ్వాలి. డిగ్రీ తర్వాత బీఈడీ చేసినవారు టెట్‌‌‌‌‌‌‌‌ పేపర్‌‌‌‌‌‌‌‌–-2లో ఉత్తీర్ణత సాధించాలి. ఎన్‌‌‌‌‌‌‌‌సీటీఈ దేశవ్యాప్తంగా ఉన్న ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుల కొరత దృష్ట్యా బీఈడీ అభ్యర్థులకు పేపర్‌‌‌‌‌‌‌‌–-1 రాసే అవకాశం ఇచ్చింది. 
  • బీఈడీ, డీఈడీ సెకండ్​ ఇయర్​ చదివే విద్యార్థులు కూడా రాయొచ్చు. పీజీటీ/ జేఎల్‌‌‌‌‌‌‌‌ అభ్యర్థులు టెట్‌‌‌‌‌‌‌‌ రాయాల్సిన అవసరం లేదు. ప్రస్తుతానికి 1 నుంచి 5వ తరగతి వరకు బోధించే ఎస్‌‌‌‌‌‌‌‌జీటీ టీచర్లు (ప్రైమరీ, స్కూల్‌‌‌‌‌‌‌‌ టీచర్లు) టెట్‌‌‌‌‌‌‌‌ పేపర్‌‌‌‌‌‌‌‌-1 రాయాలి. 6,7,8 తరగతులు బోధించే స్కూల్‌‌‌‌‌‌‌‌ అసిస్టెంట్లు, టీజీటీ (ట్రెయిన్డ్‌‌‌‌‌‌‌‌ గ్రాడ్యుయేట్‌‌‌‌‌‌‌‌ టీచర్లు), టెట్‌‌‌‌‌‌‌‌ పేపర్‌‌‌‌‌‌‌‌-–2లో అర్హత సాధించాలి.
  • వ్యాలిడిటీ: ఎన్‌‌‌‌‌‌‌‌సీటీఈ మార్గదర్శకాల ప్రకారం టెట్‌‌‌‌‌‌‌‌లో అర్హత సాధించిన అభ్యర్థుల సర్టిఫికెట్‌‌‌‌‌‌‌‌కు లైఫ్​ టైమ్​ వ్యాలిడిటీ ఉంటుంది. 2011 నుంచి టెట్‌‌‌‌‌‌‌‌ రాస్తున్న అభ్యర్థులకూ, కొత్తగా టెట్‌‌‌‌‌‌‌‌ రాయబోయే అభ్యర్థులకూ ఈ నియమం వర్తిస్తుంది.
  • వెయిటేజి: ఎందుకంటే టెట్లో తెచ్చుకున్న ప్రతి 15 మార్కులకూ 2 మార్కుల వెయిటేజి ఇస్తారు. టెట్‌‌‌‌‌‌‌‌ క్వశ్చన్​ పేపర్​ తెలుగు, ఇంగ్లీష్‌‌‌‌‌‌‌‌- మీడియాల్లో ఉంటుంది.
  • ఎగ్జామ్​ ప్యాటర్న్​: పేపర్‌‌‌‌‌‌‌‌–1లో 150 మల్టిపుల్‌‌‌‌‌‌‌‌ చాయిస్‌‌‌‌‌‌‌‌ ప్రశ్నలుంటాయి. చైల్డ్‌‌‌‌‌‌‌‌ డెవలప్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ పెడగాగి, లాంగ్వేజి–1, లాంగ్వేజి–2 (ఇంగ్లీష్‌‌‌‌‌‌‌‌), మేథమెటిక్స్, ఎన్విరాన్‌‌‌‌‌‌‌‌మెంటల్‌‌‌‌‌‌‌‌ స్టడీస్‌‌‌‌‌‌‌‌ నుంచి ప్రతీవిభాగంలో 30 చొప్పున ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు. 
  • పేపర్‌‌‌‌‌‌‌‌–2లో చైల్డ్‌‌‌‌‌‌‌‌ డెవలప్‌‌‌‌‌‌‌‌మెంట్, పెడగాగి(30), లాంగ్వేజ్‌‌‌‌‌‌‌‌–1 (30), లాంగ్వేజ్‌‌‌‌‌‌‌‌–2 (30), మ్యాథ్స్, సైన్స్‌‌‌‌‌‌‌‌ టీచర్లకు మ్యాథ్స్, సైన్స్, సోషల్‌‌‌‌‌‌‌‌ టీచర్లకు సోషల్‌‌‌‌‌‌‌‌ సబ్జెక్ట్‌‌‌‌‌‌‌‌ 60 మార్కులకు ఉంటుంది. మొత్తం 150 మార్కులకు పేపర్‌‌‌‌‌‌‌‌ మల్టిపుల్‌‌‌‌‌‌‌‌ చాయిస్‌‌‌‌‌‌‌‌లోనే ఉంటుంది. ఎస్‌‌‌‌‌‌‌‌సీఆర్‌‌‌‌‌‌‌‌టీ సిలబస్‌‌‌‌‌‌‌‌ నుంచే ప్రశ్నలు వస్తాయి.  
  • అర్హత మార్కులు: 150 మార్కుల ప్రశ్నపత్రంలో జనరల్‌‌‌‌‌‌‌‌ కేటగిరీ అభ్యర్థులు 60 శాతం, బీసీలు 50 శాతం, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు 40 శాతం మార్కులు సాధిస్తే టెట్‌‌‌‌‌‌‌‌ అర్హులుగా పరిగణిస్తారు. దివ్యాంగులు 75 శాతం వైకల్యం కలిగి ఉండాలి.   
  • ప్రిపరేషన్​ స్ట్రాటజీ: అభ్యర్థులు ఇప్పటినుంచే ప్రణాళిక ప్రకారం టైమ్​ మేనేజ్​మెంట్​ చేసుకుంటూ ప్రిపేర్​ అవ్వాలి. టెట్‌‌‌‌‌‌‌‌-1 రాసే అభ్యర్థులు కంటెంట్‌‌‌‌‌‌‌‌ 3 నుంచి 8 తరగతుల వరకు చదవాలి. పేపర్‌‌‌‌‌‌‌‌-2 రాసే అభ్యర్థులు కంటెంట్‌‌‌‌‌‌‌‌ 3 నుంచి 10వ తరగతి స్థాయి వరకు చదవాలి. తెలుగు అకాడమీ పుస్తకాలు చదివి నోట్సు రాసుకోవాలి. సాధన చేయాలి.  ప్రైవేట్ పబ్లికేషన్స్​ కాకుండా తెలుగు అకాడమీ బుక్స్​ చదివి, నోట్స్​ రాసుకొని రివిజన్​ చేయడం వలన ఎక్కువ స్కోర్​ చేయవచ్చు. 

సబ్జెక్ట్​-సిలబస్​ 

  • చైల్డ్‌‌‌‌‌‌‌‌ డెవలప్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ అండ్‌‌‌‌‌‌‌‌ పెడగాజి: ఈ సబ్జెక్ట్​ చదివేటప్పుడు కీలకమైన మూడు విభాగాలపై అవగాహన ఏర్పరుచుకోవాలి. మొదటి యూనిట్‌‌‌‌‌‌‌‌ శిశువికాసం. ఇందులో వికాస దశలు, వికాస సిద్ధాంతాలు, వైయక్తిక భేదాలు కన్పించే అంశాలైన ప్రజ్ఞ, సహజ సామర్థ్యాలు, వైఖరులు, అభిరుచులు, సృజనాత్మకత, ఆలోచన, మూర్తిమత్వం, మానసిక ఆరోగ్యం- శిశు అధ్యయన పద్ధతుల మీద ఎక్కువ ఫోకస్​ చేయాలి.
  • చైల్డ్‌‌‌‌‌‌‌‌ డెవలప్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ అండ్‌‌‌‌‌‌‌‌ పెడగాజిలో అభ్యసనం (లర్నింగ్‌‌‌‌‌‌‌‌) యూనిట్‌‌‌‌‌‌‌‌లో ప్రధాన అంశాలైన అభ్యసనా సిద్ధాంతాలు, అభ్యసన బదలాయింపు, ప్రేరణ, అభ్యసన అంగాలు, స్మృతి-విస్మృతిపై ఎక్కువగా దృష్టి పెట్టాలి. 
  • అధ్యాపన శాస్త్రం (పెడగాజి)లో కీలకమైన సహిత విద్య, బోధన దశలు, బోధన ఉపగమాలు, నిరంతర సమగ్ర మూల్యాంకనం, ఉచిత నిర్బంధ విద్యాహక్కు చట్టం (2009), జాతీయ పాఠ్యప్రణాళిక చట్రం (2005) ప్రాక్టీస్​ చేయాలి. 
  • లాంగ్వేజెస్‌‌‌‌‌‌‌‌:  లాంగ్వేజ్‌‌‌‌‌‌‌‌-1, లాంగ్వేజ్‌‌‌‌‌‌‌‌-2లకు సంబంధించి ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం ముద్రించిన పాఠ్య పుస్తకాల్లోని వ్యాకరణ అంశాలు, వాటి ఉదాహరణలు బాగా చదవాలి. సిలబస్‌‌‌‌‌‌‌‌లో ఇచ్చిన సాహిత్యం అవగాహన చేసుకోవాలి. 
  • కంటెంట్‌‌‌‌‌‌‌‌ పై పట్టు పెంచుకుందాం: పేపర్‌‌‌‌‌‌‌‌-1 అభ్యర్థులు మ్యాథ్స్​, సైన్స్​, సోషల్​ కంటెంట్‌‌‌‌‌‌‌‌ను 3వ తరగతి నుంచి 8వ తరగతి వరకు చదవాలి. పేపర్‌‌‌‌‌‌‌‌-2 అభ్యర్థులు 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు కంటెంట్‌‌‌‌‌‌‌‌ చదవాలి. తెలుగు అకాడమీ లాంటి ప్రామాణిక పుస్తకాలు చదువుతూ సొంతంగా నోట్సు తయారుచేసుకోవడం మంచిది. 
  • మ్యాథ్స్​ కంటెంట్‌‌‌‌‌‌‌‌లో అర్థమెటిక్​, సంఖ్యావ్యవస్థ, రేఖాగణితం, క్షేత్రమితి, బీజగణితం, దత్తాంశ నిర్వహణ యూనిట్లపై ఫోకస్​ చేయాలి. 
  • సైన్స్‌‌‌‌‌‌‌‌ కంటెంట్‌‌‌‌‌‌‌‌లో సజీవ ప్రపంచం, జీవప్రక్రియలు, సహజ దృగ్విషయాలు, మన పర్యావరణం యూనిట్లు బాగా చదవాలి. 
  • సోషల్‌‌‌‌‌‌‌‌ స్టడీస్‌‌‌‌‌‌‌‌లో 6 థీమ్‌‌‌‌‌‌‌‌లు ఉన్నాయి. 1. భూమి వైవిధ్యం- మాన చిత్రాలు 2. ఉత్పత్తి- వినిమయం, జీవనాధారాలు 3.రాజకీయ వ్యవస్థలు-, పరిపాలన 4.సామాజిక వ్యవస్థీకరణ - అసమానతలు 5.మతం-, సమాజం 6. సంస్కృతి విభాగాలు ప్రాక్టీస్​ చేయాలి. 
  • కంటెంట్‌‌‌‌‌‌‌‌ చదివేటప్పుడు 3, 4, 5 తరగతులకు రాసిన పాఠ్యాంశం, ఎక్కువ తరగతులు 6, 7, 8, 9, 10లో పునరావృతం అయినప్పుడు ఒకేసారి చదివి భావనలను అర్థం చేసుకొని, నోట్స్​ ప్రిపేర్​ చేసుకోవాలి. రివిజన్​ టైమ్​లో ఈజీగా ఉంటుంది. చదివింది గుర్తు పెట్టుకోవడానికి రివిజన్​ చాలా ముఖ్యం. కఠినంగా ఉన్న అంశాలను ఫ్రెండ్స్​, టీచర్స్​తో చర్చించాలి. ప్రీవియస్​ పేపర్స్​ ప్రాక్టీస్​తో మంచి మార్కులు పొందవచ్చు.

నోటిఫికేషన్​ 

ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌‌‌‌‌‌‌‌) సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌ 15వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్నట్టు పాఠశాల విద్యాశాఖ  డైరెక్టరేట్‌‌‌‌‌‌‌‌ తెలిపింది. అర్హులైన అభ్యర్థులు ఆగష్టు16 వ తేదీ వరకు వెబ్‌‌‌‌‌‌‌‌సైట్‌‌‌‌‌‌‌‌లో దరఖాస్తు చేయాలి. సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌ 9వ తేదీ నుంచి అభ్యర్థులు హాల్‌‌‌‌‌‌‌‌టికెట్లు డౌన్‌‌‌‌‌‌‌‌లోడ్‌‌‌‌‌‌‌‌ చేసుకోవచ్చు. టెట్‌‌‌‌‌‌‌‌ ఫలితాలను సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌ 27వ తేదీన వెల్లడించనున్నారు. టెట్‌‌‌‌‌‌‌‌ ఉత్తీర్ణత సర్టిఫికెట్‌‌‌‌‌‌‌‌ జీవితకాలం చెల్లుబాటులో ఉంటుంది. బీఈడీ, డీఎడ్‌‌‌‌‌‌‌‌ ఆఖరి సంవత్సరం చదువుతున్న వారూ దరఖాస్తు చేసుకోవచ్చు.  పూర్తి వివరాలకు www.tstet.cgg.gov.in వెబ్​సైట్​లో సంప్రదించాలి.