పాకిస్థాన్ గ్వాదర్ పోర్ట్పై ఉగ్రదాడి..ఇద్దరు హతం

పాకిస్థాన్ గ్వాదర్ పోర్ట్పై ఉగ్రదాడి..ఇద్దరు హతం

పాకిస్థాన్ లోని గ్వాదర్ పోర్ట్ అథారిటీ కాంప్లెక్స్ పై బుధవారం (మార్చి 20) మధ్యాహ్నాం ఉగ్రవాదులు దాడి చేశారు. గ్వాదర్ పోర్ట్ తుపాకీ కాల్పులు, పేలుడు శబ్దాలతో దద్దరిల్లిపోయింది. సాయుధ దుండగులు గ్వాదర్ పోర్ట్ అథారిటీ కాంప్లెక్స్ లోకి చొరబడి కాల్పులు జరిపారు. దీంతో పోలీసులు, భద్రతా బలగాలు సంఘటనా స్థలానికి చేరుకుని ఎదురు కాల్పులు జరిపినట్లు మక్రాన్ కమిషనర్ సయూద్ అహ్మద్ ఉమ్మ్రాని చెప్పారు. ఈ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతం అయినట్లు తెలిపారు.  దీంతో గ్వాదర్ పోర్టు సమీపంలో పేలుడు కూడా సంభవించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇంకా కాల్పులు కొనసాగుతున్నట్లు సమాచారం. 

గ్వాదర్ పోర్ట్ అరేబియా సముద్రంలో కీలకమైన చమురురవాణామార్గం అయిన హార్ముజ్ జలసంధి సమీపంలో ఉంది. ఇది బిలియన్ల విలువైన చైనా-పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్ కి డీప్ వాటర్  పోర్ట్. రోడ్లు, ఇంధన ప్రాజెక్టులను కలిగి ఉంది. చైనా అధ్యక్షుడు జి జిన్ పింగ్ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ లో భాగం కూడా. 

ఈ ప్రాంతంలో దశాబ్దాలుగా వేర్పాటు వాద తిరుగుబాటు జరుగుతోంది. గ్వాదర్ ను అభివృద్ధి చేయడంతో సహ ఖనిజాలు అధికంగా ఉన్న బలూచిస్తాన్ లో చైన తన బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ కింద భారీగా పెట్టుబడులు పెట్టింది.

ALSO READ :- 10 ఏండ్ల నుంచి పేరుకుపోయిన సమస్యలన్నీ పరిష్కరిస్తాం: మల్లు రవి

 
చైనా లక్ష్యాలపై గతంలో పాకిస్థాన్ లోని పలు ఉగ్రవాద గ్రూపులు దాడి చేశాయి. 2023 ఆగస్టులో వేర్పాటు వాద బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ.. గ్వాదర్ లో చైనా కార్మికుల కాన్వాయ్ పై దాడులు చేశారు. ఆ తర్వాత బుధవారం (మార్చి 20) ఉగ్రదాడి జరిగింది. దీంతో పోలీసులు, భద్రతా సిబ్బంది అప్రమత్తం అయ్యాయి.