
జగిత్యాల, క్రైమ్ : దసరాకు ముందు కొడుకు సూసైడ్ చేసుకొని చనిపోగా అతడిని తలుచుకుంటూ తాగుడుకు బానిసైన ఓ తండ్రి.. బుధవారం ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. జగిత్యాలలోని మిషన్ కాంపౌండ్ ఏరియాకు చెందిన పోచయ్య కొడుకు చనిపోగా అతడిని తలుచుకుని తాగుతూ బాధపడుతున్నాడు. ఈ నేపథ్యంలో బుధవారం ఉరి వేసుకుని సూసైడ్ చేసుకున్నాడు. టౌన్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.