
కో ఎడ్యుకేషన్ కు ఒప్పుకోం: తాలిబాన్ మంత్రి
కాబూల్: అఫ్గాన్‌లో అమ్మాయిలు కొన్ని షరతులకు లోబడి చదువుకోవచ్చని తాలిబాన్ సర్కారు అనుమతిచ్చింది. యూనివర్సిటీలు, పీజీ లెవల్ లో మహిళలు చదువుకోవచ్చని చెప్పింది. కోఎడ్యుకేషన్ కు ఎట్టిపరిస్థితిలోనూ ఒప్పుకునేదిలేదని, దేశంలో కో ఎడ్యుకేషన్ సిస్టమ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. అమ్మాయిలు, అబ్బాయిలకు క్లాస్ రూమ్స్ వేర్వేరుగా ఉంటాయని స్పష్టం చేసింది. అమ్మాయిలు తప్పనిసరిగా డ్రెస్ కోడ్ పాటించాలని, హిజబ్ వేసుకోవాలని ఆదేశించింది. అయితే తలతో పాటు ముఖం కూడా కనిపించకుండా కవర్ చేసుకోవాలా? లేదా? అనే దానిపై క్లారిటీ ఇవ్వలేదు. ఈ మేరకు హయ్యర్ ఎడ్యుకేషన్ మినిస్టర్ అబ్దుల్ బాఖీ హక్కానీ ఆదివారం కొత్త రూల్స్ ను వెల్లడించారు. ‘‘మేం కాలాన్ని 20 ఏండ్లు వెనక్కి తీసుకెళ్లాలని అనుకోవట్లేదు. ప్రస్తుతమున్న పునాదులపైనే బిల్డింగ్ నిర్మిస్తాం” అని ఆయన పేర్కొన్నారు.