టెలిగ్రాంలో సినిమాలు డౌన్లోడ్ చేస్తే..!

టెలిగ్రాంలో సినిమాలు డౌన్లోడ్ చేస్తే..!

టెలిగ్రామ్‌ను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లా కాకుండా థర్డ్‌ పార్టీ యాప్‌గా వినియోగిస్తున్నారు. మెసెంజింగ్ కు కాకుండా పైరసీ సినిమాలు, అసభ్యకరమైన వీడియో, ఫొటో లింక్ లు ఫార్వార్డిండ్ చేయడానికి చూడటానికి వినియోగిస్తున్నారు. వీటి కోసం కొందరు గ్రూపులు క్రియేట్ చేసి మరీ షేర్ చేస్తున్నారు. థియేటర్, ఓటీటీల్లో ఏ సినిమా వచ్చినా టెలిగ్రామ్ వైపు తొంగిచూసే పరిస్థితి. అలాంటి వాళ్లు ఇక నుంచి జాగ్రత్తగా ఉండాల్సిందే. సినిమా లింక్ ల పేరుతో సైబర్ నేరగాళ్లు ఫోన్లకి వైరస్ ని పంపిస్తున్నారు. అంతేకాకుండా ఓటీపీ, మెసేజ్ లేకుండా బ్యాంక్ అకౌంట్ నుంచి పైసలు ఖాళీ చేస్తున్నారు. 

గతంలో సినిమా డౌన్ లోడ్ చేసుకోవాలంటే.. లింక్ క్లిక్ చేస్తే సరిపోయేది. అయితే కొన్ని రోజులుగా ఆ సెట్టింగ్స్ మారిపోయాయి. ఏదైనా సినిమా డౌన్ లో చేయాలంటే లింక్ కి బదులుగా డౌన్ లోడ్ బటన్ వస్తుంది. కొద్దిసేపు ఆగి వచ్చిన డౌన్ లోడ్ బటన్ తో సినిమా డౌన్ లోడ్ చేసుకోవాలి. అలాంటి సెట్టింగ్ తోనే హ్యాకర్లు వైరస్, మాల్వేర్ ను ఫోన్ లలోకి పంపుతున్నారు. వాటి వల్ల పర్సనల్ డేటా అంతా హ్యాకర్ల చేతికి వెళ్లే అవకాశం ఉంటుంది. టెలిగ్రామ్ లింక్స్ క్లిక్ చేసి పోయిన ఏడాది 50వేల మంది దాదాపుగా రూ.95 కోట్లు పోగొట్టుకున్నారు. పైరసీని ప్రోత్సహించడం నేరం కనుక డబ్బు పోగొట్టుకున్నవారు పోలీసులకు కంప్లైంట్ చేసేందుకు భయపడుతున్నారు.