ఫ్లయింగ్ టాక్సీ.. మన దగ్గర కూడా ఉంటే ఎంత బాగుండో

ఫ్లయింగ్ టాక్సీ.. మన దగ్గర కూడా ఉంటే ఎంత బాగుండో

ప్రపంచవ్యాప్తంగా ఉన్న నగరాల్లో వాహనాల రాకపోకలు ప్రధాన సమస్యగా మారాయి. ఈ సమస్యను తగ్గించడానికి కొత్త మార్గాలు అన్వేషించడం ఎంతైనా అవసరమే. గతంలో కంటే ఈ సమస్య ఎక్కువగా ఉంది. కావున దేశంలోని పెద్ద నగరాలు, ముఖ్యంగా ఢిల్లీ, ముంబయి, హైదరాబాద్, బెంగళూరు వంటి మెట్రో నగరవాసులు ఎదుర్కొనే ట్రాఫిక్ జామ్‌ల గురించి, ట్రాఫిక్ జామ్‌ల మధ్య వారు రోడ్లపై గడిపే సమయం గురించి ఇటీవల తరచుగా వస్తోన్న వార్తలే సాక్ష్యంగా నిలుస్తున్నాయి.

ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టాలన్న ఉద్దేశంతో, దక్షిణ ప్రావిన్స్‌లో రద్దీగా ఉండే గ్వాంగ్‌డాంగ్ నగరంలో పనిచేయడానికి చైనా "ఫ్లయింగ్ టాక్సీలను" ఆమోదించింది. సివిల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ చైనా (CAAC) ప్రపంచంలోని మొట్టమొదటి ఎలక్ట్రికల్ వర్టికల్ టేకాఫ్, ల్యాండింగ్‌కు టైప్ సర్టిఫికేట్ ని అందజేసింది. దీన్ని గ్వాంగ్‌జౌ-ఆధారిత కంపెనీ ఇహాంగ్ తయారు చేసింది.

EH216-S AAV, రకం సర్టిఫికేట్ పొందిన ఈ వాహనం, ఇద్దరు ప్రయాణీకులను తీసుకువెళ్లడానికి రూపొందించబడిన పూర్తి స్వయంప్రతిపత్త డ్రోన్. దీన్ని బట్టి చూస్తుంటే పలు సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో కనిపించే సెల్ఫ్ డ్రైవింగ్ ఎయిర్ టాక్సీల తరహా వాహనాలను రూపొందేందుకు ఎక్కువ సమయమేం పట్టనట్టు తెలుస్తోంది.

Also Read :- రోడ్డుపై ప్రయాణిస్తున్న విమానం.. చూసేందుకు ఎగబడ్డ జనం