కారు కొనాలనుకుంటున్నారా? ఇదే మంచి సమయం..

కారు కొనాలనుకుంటున్నారా? ఇదే మంచి సమయం..

ముంబై: సేల్స్ లేక ఇబ్బంది పడుతున్న కార్ల కంపెనీలు టీజర్ లోన్స్‌‌తో ముందుకొస్తున్నాయి. ఆర్‌‌‌‌బీఐ తన మానిటరీ పాలసీని కాస్త సరళతరం చేయడంతో… ఆటో కంపెనీలు బ్యాంక్‌‌లతో జత కడుతున్నాయి. మారుతీ సుజుకి, హ్యుండాయ్, మెర్సిడెస్ బెంజ్ లాంటి కంపెనీలు ఇప్పటికే టీజర్ లోన్స్‌‌ను తీసుకొచ్చాయి. టీజర్ లోన్స్ ఆఫర్ అంటే కస్టమర్లను ఆకట్టుకోవడానికి ఫస్ట్ కొన్ని నెలల పాటు లేదా ఏళ్ల పాటు తక్కువ వడ్డీ రేట్లను ఆఫర్ చేస్తాయి. ఆ తర్వాత మెల్లమెల్లగా వడ్డీరేట్లను పెంచుతారు. అయితే వీటి నిబంధనలు పారదర్శకంగా ఉండవని, ఇలాంటి ప్రొడక్ట్‌‌లు 2007–08లో అమెరికాలో ఏర్పడిన సంక్షోభానికి ఒక కారణమయ్యాయని ఆర్‌‌‌‌బీఐ కొన్నేళ్ల ముందటే హెచ్చరించింది. కారు సేల్స్‌‌ను మళ్లీ పునరుద్ధరించుకునేలా చేయడానికి  ప్రమోషనల్ టీజర్ లోన్స్ అవసరమని బ్యాంకింగ్ వర్గాలు చెబుతున్నాయి. కరోనా వైరస్ నేపథ్యంలో ప్రజలకు కూడా కొన్ని విషయాల్లో సడలింపులు అవసరమవుతాయని, ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగానే ఈ స్కీమ్ ఉన్నట్టు సంబంధిత వర్గాలు చెప్పాయి. ఈ విషయంపై ఆర్‌‌‌‌బీఐ కానీ, ఆటో కంపెనీలు కానీ స్పందించలేదు. ప్రమోషనల్ లోన్స్‌‌తో మళ్లీ మార్కెట్‌‌లో మస్తు డిమాండ్ నెలకొంటుందని ప్రైవేట్ బ్యాంక్‌‌కి చెందిన ఓ రిటైల్ హెడ్ అన్నారు.

For More News..

వందేళ్ల తర్వాత ముంబైకి తుఫాన్ ముప్పు

పండులో పటాకులు పెట్టి.. దాన్ని ఏనుగుకు పెట్టి..

మొబైల్ కంపెనీలకు సూపర్​ ఆఫర్

ఈ నెల నుంచి కొత్త కరెంట్ బిల్లులు