
ప్రయాగ్రాజ్: శీతాకాలం చలితో పాటు దేశవిదేశాలకు చెందిన పక్షులను వెంట తీసుకొస్తుంది. ఏటా అలా వలస వచ్చే సైబీరియన్ కొంగలు ప్రస్తుతం గంగానదీ తీర ప్రాంతంలో సందడి చేస్తున్నాయి. పర్యాటకులకు ఆనందాన్ని పంచుతున్నాయి. వేల కిలోమీటర్లు ప్రయాణించి భారత తీర ప్రాంతాలకు చేరే పక్షులు మరికొన్ని నెలల పాటు ఇక్కడే ఉండనున్నాయి.
మధ్య ఆసియా దేశమైన సైబీరియా నుంచి ఏటా ఈ కొంగలు ఉత్తర్ప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ తీరానికి వలస వచ్చాయి. త్రివేణీ సంగమం వద్ద చేపలు వేటాడుతూ సందడి చేస్తుంటాయి. సాధారణంగా సైబీరియన్ కొంగలు ఏటా సంతానోత్పత్తి కోసం శీతాకాలంలో భారత్కు వలస వస్తుంటాయి. ఒంటరిగా వచ్చే ఈ పక్షులు కొన్ని నెలల అనంతరం పిల్లలతో కలిసి తిరిగి వెళ్తాయి.
#WATCH Thousands of Siberian birds have flocked to Sangam and nearby wetlands in Prayagraj, Uttar Pradesh pic.twitter.com/RuZH5yCHYY
— ANI UP/Uttarakhand (@ANINewsUP) February 12, 2022