రవితేజకు ఇష్టమైన క్రికెటర్ ఇతనే.. ఛాన్స్ వస్తే ఆ క్రికెటర్ బయోపిక్ చేస్తా

రవితేజకు ఇష్టమైన క్రికెటర్ ఇతనే.. ఛాన్స్ వస్తే ఆ క్రికెటర్ బయోపిక్ చేస్తా

టాలీవుడ్ మాస్ మహారాజ రవితేజ భారత్  ఆస్ట్రేలియా మ్యాచ్ లో మెరిశాడు. స్టార్ స్పోర్ట్స్ తెలుగు క్రికెట్‌ లైవ్‌లో కామెంటేటర్ అవతారం ఎత్తాడు. టైగర్ నాగేశ్వరరావు మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా తెలుగు క్రికెట్‌ లైవ్ కామెంటరీలో పాల్గొన్నాడు రవితేజ.

ALSO READ : యాక్టర్ టూ కామెంటేటర్.. రవితేజకే సాధ్యమైన మాస్ రికార్డు ఇది

స్టార్ స్పోర్ట్స్ లవర్స్‌తో రవితేజ చిట్‌ చాట్ చేశాడు. ఈ సంరద్బంగా తనకు ఇష్టమైన క్రికెటర్లు ఎవరో చెప్పేశాడు. విరాట్‌ కోహ్లీ ఆటిట్యూడ్‌, దూకుడు అంటే కూడా చాలా ఇష్టమన్నాడు.  కోహ్లీ  బ్యాట్‌ను హ్యాండిల్‌ చేసే విధానం చాలా బాగుంటుందని చెప్పుకొచ్చాడు.

ఓ  క్రికెట్‌ అభిమాని.. రవితేజను ఆసక్తికర ప్రశ్న అడిగాడు.  ఒకవేళ బయోపిక్ చేయాల్సి వస్తే ఏ క్రికెటర్‌పై చేస్తారని అడిగాడు. దీంతో రవితేజ వెంటనే మహ్మద్ సిరాజ్ అని చెప్పేశాడు. తనకు క్రికెటర్ బయోపిక్‌లో నటించే అవకాశమొస్తే....తప్పకుండా  సిరాజ్‌ బయోపిక్‌లో నటిస్తానని వెల్లడించాడు.