ఇన్సూరెన్స్ కంపెనీలపై వస్తున్న టాప్-5 కంప్లెయింట్స్ ఇవే.. పాలసీ హోల్డర్లు జర చూస్కోండి

ఇన్సూరెన్స్ కంపెనీలపై వస్తున్న టాప్-5 కంప్లెయింట్స్ ఇవే.. పాలసీ హోల్డర్లు జర చూస్కోండి

ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నారా? అయితే ఈ వార్త మీకోసమే. ఇటీవల రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన గణాంకాలు పాలసీదారుల అసహనాన్ని, ఇన్సూరెన్స్ కంపెనీల పనితీరును కళ్లకు కట్టాయి. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఇన్సూరెన్స్ కంపెనీలపై ఫిర్యాదులు భారీగా పెరిగాయి. మొత్తం 2లక్షల 58వేల వరకు ఫిర్యాదులు అందగా.. అందులో క్లెయిమ్ సెటిల్‌మెంట్ చుట్టూనే మెజారిటీ సమస్యలు తిరుగుతున్నాయని తేలింది. ఈ క్రమంలో అసలు పాలసీ హోల్డర్లు ఇన్సూరెన్స్ కంపెనీలపై ఇస్తున్న టాప్-5 కంప్లెయింట్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. 

1. క్లెయిమ్ పరిష్కరించకపోవడం: ఇది చాలా మంది పాలసీ హోల్డర్లు లేవనెత్తుతున్న నంబర్ వన్ సమస్య. పాలసీదారులు క్లెయిమ్ కోసం దరఖాస్తు చేసుకున్నా.. కంపెనీలు నిర్ణీత సమయంలో స్పందించకపోవడం లేదా పెండింగ్‌లో పెట్టడంపై 15 శాతానికి పైగా ఫిర్యాదులు వచ్చాయని కేంద్ర ప్రభుత్వ డేటా ప్రకారం వెల్లడైంది. 

2. కారణం లేకుండా క్లెయిమ్ తిరస్కరణ: క్లెయిమ్ గురించి ఎలాంటి సరైన వివరణ ఇవ్వకుండానే కంపెనీలు రిజెక్ట్ చేస్తున్నాయని 6.54 శాతం మంది ఫిర్యాదు చేశారు.

3. సర్వైవల్ బెనిఫిట్స్ చెల్లించకపోవడం: పాలసీ కాల పరిమితిలో రావాల్సిన ప్రయోజనాలు అందడం లేదని 3.74% ఫిర్యాదులు కంప్లెయింట్స్ చేస్తున్నారు.

4. మెచ్యూరిటీ క్లెయిమ్స్ నిలిపివేత: పాలసీ గడువు ముగిసిన తర్వాత రావాల్సిన మెచ్యూరిటీ సొమ్ము చెల్లింపులో ఇన్సూరెన్స్ కంపెనీలు జాప్యం గురించి చాలా మంది పాలసీ హోల్డర్లు కోపంగా ఉన్నారు. 

5. అంచనా వేసిన నష్టానికి, ఇచ్చే క్లెయిమ్‌కు మధ్య తేడా: పాలసీదారులు ఆశించిన క్లెయిమ్ మొత్తానికి.. కంపెనీలు సెటిల్ చేసే మొత్తానికి మధ్య భారీ వ్యత్యాసం ఉండటంపై ఎక్కువగా కంప్లెయింట్స్ వస్తున్నాయని ఫిర్యాదుల డేటా చెబుతోంది. 

ఎక్కువగా కంప్లెయింట్స్ ఉన్న కంపెనీలు ఇవే:

రాజ్యసభలో సమర్పించిన డేటా ప్రకారం.. లైఫ్ ఇన్సూరెన్స్ విభాగంలో LICపై అత్యధికంగా 74,104 ఫిర్యాదులు రాగా, ప్రైవేట్ రంగంలో భారతీ ఆక్సా కంప్లెయింట్స్ లిస్టులో ముందుంది. ఇక నాన్-లైఫ్ అంటే హెల్త్ & జనరల్ ఇన్సూరెన్స్ కేటగిరీలో స్టార్ హెల్త్ పై అత్యధికంగా 20,527 ఫిర్యాదులు అందాయి. నేషనల్ ఇన్సూరెన్స్, కేర్ హెల్త్, నివా బూపా వంటి కంపెనీలు కూడా టాప్-10లో ఉన్నాయి.

►ALSO READ | దేశంలో సహకార మార్కెటింగ్: మధ్యవర్తుల దోపిడీకి చెక్.. రైతులకు ప్రయోజనాలు ఇలా..

ఫిర్యాదులు పెరుగుతుండటంతో ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ సంస్థ IRDAI రూల్స్ మరింత కఠినతరం చేస్తోంది. ప్రీ-ఎగ్జిస్టింగ్ డిసీజ్ వెయిటింగ్ పీరియడ్‌ను 4 ఏళ్ల నుంచి 3 ఏళ్లకు తగ్గించడం, ఫ్రీ-లుక్ పీరియడ్‌ను 30 రోజులకు పెంచడం వంటి చర్యలు తీసుకుంది. ఇన్సూరెన్స్ కంపెనీలు కేవలం ప్రీమియం వసూలు చేయడమే కాదు.. కష్టకాలంలో పాలసీదారుడికి అండగా ఉండాలని సూచిస్తోంది.