ఆదివాసీ సంస్కృతిని కాపాడుకోవాలి

ఆదివాసీ సంస్కృతిని కాపాడుకోవాలి

మహబూబాబాద్: ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉన్నదని ములుగు ఎమ్మెల్యే సీతక్క అన్నారు. మహబూబాబాద్  జిల్లాలోని  గుంజేడు ముసలమ్మ  తల్లి  జాతరలో  సీతక్క పాల్గొన్నారు. మూడు రోజుల పాటు  జరిగిన ఈ జాతరను  ఆదివాసీలు  ఘనంగా జరుపుకున్నారు.  ఇతర జిల్లాల నుంచి  కూడా భక్తులు  పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.  జాతరలో పాల్గొన్న సీతక్క  ఆదివాసీ నృత్యం చేశారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ... మేడారం సమక్క  సారలమ్మ జాతర లాగే   గుంజేడు ముసలమ్మ తల్లికీ ప్రాముఖ్యత ఉందన్నారు. ఆదివాసీ ప్రతి పండగ వెనుక ఒక మంచి కారణముంటుందన్నారు. ఆదివాసీ సంస్కృతిపై దాడికి పాల్పడితే ఊరుకునేదిలేదని హెచ్చరించారు. 

మరిన్ని వార్తల కోసం:

భగ్గుమంటున్న భానుడు

మంచు గుప్పిట్లో కశ్మీరం

ఉక్రెయిన్ తీరుపై పుతిన్ ఫైర్