బలి మేకకు దండేసినట్లు.. ఈటలకు అమిత్ షా దండేశారు

V6 Velugu Posted on Sep 24, 2021

కరీంనగర్: బలిచ్చే ముందు మేకపోతుకు దండేసినట్లు.. ఈటలకు అమిత్ షా దండేశారని టీఆర్ఎస్ నేత పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. హుజూరాబాద్ ప్రజలు ఈటల రాజేందర్ పై తిరగబడే రోజు త్వరలోనే వస్తుందని ఆయన అన్నారు. హుజురాబాద్ ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో కౌశిక్ రెడ్డి మాట్లాడారు. 

‘హుజూరాబాద్ నియోజకవర్గంలో ఉన్న టీఆర్ఎస్ కార్యకర్తలు.. చందాలు వేసుకుని మరీ గెల్లు శ్రీనివాస్‎కు ఫ్లెక్సీలు కడుతున్నారు. సీఎం కేసీఆర్ మా దేవుడు. గెల్లు శ్రీనివాస్‎ను హుజూరాబాద్ ప్రజలు రాబోయే ఉప ఎన్నికల్లో లక్ష మెజారిటీతో గెలిపించబోతున్నారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీజేపీలో చేరగానే వ్యవసాయ నల్ల చట్టలు.. తెల్ల చట్టాలు అయ్యాయా? ఈటల రాజేందర్‎కు దమ్ముంటే.. పెంచిన ధరలు తగ్గించి ఓట్లు అడగాలే. సీఎం సీటుకు ఈటల గురి పెట్టకపోతే.. ప్రతిపక్ష నేతలు ఈటల సీఎం కావాలని కోరితే ఎందుకు ఖండించలేదు. కబుర్లు చెప్పేది ఈటల రాజేందర్.. పనులు చేసేది కేసీఆర్. కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ తెచ్చే దమ్ము బీజేపీ నాయకులకు ఉందా?’ అని కౌశిక్ ప్రశ్నించారు.

For More News..

టీడీపీకి పట్టిన గతే టీఆర్ఎస్‎కు పడుతుంది

కరోనా వ్యాక్సిన్ తీసుకోవాలంటూ వైరైటీ ప్రచారం

గడ్డిపోచలా తీసేస్తే.. గడ్డపార అవుతానని అనుకోలేదు

Tagged Bjp, TRS, Telangana, CM KCR, amit shah, Eatala Rajender, Huzurabad, Huzurabad By election, Padi Kaushik Reddy

Latest Videos

Subscribe Now

More News