నేనో బ్యాడ్‌‌‌‌‌‌‌‌ప్రమోటర్‌‌‌‌‌‌‌‌ను

నేనో బ్యాడ్‌‌‌‌‌‌‌‌ప్రమోటర్‌‌‌‌‌‌‌‌ను

కరోనా కేసుల్లో ముందుండటం కూడా మాకు గౌరవమే

వాషింగ్టన్‌‌‌‌‌‌‌‌: అమెరికాలో 15 లక్షలకు పైగా కేసులు నమోదవడం, కరోనా కేసుల్లో ప్రపంచంలో తాము ముందుండటం తమకేం చెడ్డ పేరు కాదని, గౌరవమని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్‌‌‌‌‌‌‌‌ట్రంప్ ‌‌‌‌‌‌‌‌అన్నారు. తాము అందరికన్నా ఎక్కువ టెస్టులు చేస్తున్నాం కాబట్టే ఎక్కువ కేసులు నమోదవుతున్నాయని చెప్పారు. కాబట్టి ఎక్కువ కేసులు తమకేం బ్యాడ్‌‌‌‌‌‌‌‌కాదని, బ్యాడ్జ్‌‌‌‌‌‌‌‌ఆఫ్‌‌‌‌‌‌‌‌హానరని చెప్పుకొచ్చారు. కరోనా వ్యాప్తి తర్వాత తొలిసారి వైట్‌‌‌‌‌‌‌‌హౌస్‌‌‌‌‌‌‌‌లో కేబినెట్ ‌‌‌‌‌‌‌‌మీటింగ్‌‌‌‌‌‌‌‌ జరిగింది. తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా లాటిన్‌‌‌‌‌‌‌‌ అమెరికా, ముఖ్యంగా బ్రెజిల్‌‌‌‌‌‌‌‌కు ట్రావెల్ ‌‌‌‌‌‌‌‌బ్యాన్‌‌‌‌‌‌‌‌ విధిస్తారా అని అడిగిన ప్రశ్నకు ట్రంప్ ‌‌‌‌‌‌‌‌స్పందించారు. అక్కడ కేసులు పెరుగుతున్నాయని, కాబట్టి ఆలోచించాల్సిన అవసరముందని చెప్పారు. ‘బ్రెజిల్ వాళ్లు ఇక్కడికి వచ్చి అమెరికన్లకు వైరస్ అంటించడం నాకిష్టం లేదు. వాళ్లూ అనారోగ్యానికి గురవడం ఇష్టం లేదు’ అన్నారు. అమెరికాలో ఇప్పటివరకు కోటి 26 లక్షల టెస్టులు చేసినట్టు అక్కడి సెంటర్స్ ‌‌‌‌‌‌‌‌ఫర్ ‌‌‌‌‌‌‌‌డిసీజ్‌‌‌‌‌‌‌‌ కంట్రోల్ ‌‌‌‌‌‌‌‌వెల్లడించింది.

నేనో బ్యాడ్‌‌‌‌‌‌‌‌ప్రమోటర్‌‌‌‌‌‌‌‌ను

కరోనా రాకుండా హైడ్రాక్సీ క్లోరోక్విన్‌‌‌‌‌‌‌‌(హెచ్‌‌‌‌‌‌‌‌సీక్యూ) కాపాడుతుందని ట్రంప్‌‌‌‌‌‌‌‌అన్నారు. ఇంకొన్ని రోజులు మందు వాడతానని చెప్పారు. తాను వాడుతున్నానని చెప్పినందుకే ఆ డ్రగ్‌‌‌‌‌‌‌‌కు చెడ్డ పేరొచ్చిందన్నారు. తానో బ్యాడ్‌‌‌‌‌‌‌‌ప్రమోటర్‌‌‌‌‌‌‌‌నని, ఇంకెవరైనా ప్రమోట్‌‌‌‌‌‌‌‌చేయాలనుకుంటే అంతకన్నా గొప్ప విషయం ఏముంటుందని చెప్పుకొచ్చారు. హైడ్రాక్సీ క్లోరోక్విన్‌‌‌‌‌‌‌‌ఓ పవర్‌‌‌‌‌‌‌‌ఫుల్‌‌‌‌‌‌‌‌డ్రగ్‌‌‌‌‌‌‌‌అని, మనకు హాని చేయదన్నారు. తాను పది రోజులుగా దాన్ని వాడుతున్నానని, ఇప్పటివరకు ఎలాంటి సైడ్‌‌‌‌‌‌‌‌ఎఫెక్ట్స్‌‌‌‌‌‌‌‌లేవని చెప్పారు.

For More News..

వరల్డ్‌‌కప్ ‌‌లేకపోతే ఐపీఎల్‌‌కు చాన్స్‌‌!

ఆ దేశాలను ఏకాకిని చేయాలి: వెంకయ్యనాయుడు

వీడియో వైరల్: బెంగళూరులో వింత సప్పుడు

సిమ్ బ్లాక్ అయితదంటూ స్కూల్ టీచర్ కు ఫోన్ చేసి..