
కీసర కిడ్నాప్ కేసులో ట్విస్ట్.. కిడ్నాప్‌కు గురైన శ్వేత అత్తింటి కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్‌ఎదుట ఆందోళనకు దిగారు. గురువారం (సెప్టెంబర్25)న్యాయం చేయాలంటూ ఆమె భర్త, అత్తమామ, కుటుంబ సభ్యులు పోలీసులను డిమాండ్ చేశారు. మరోవైపు శ్వేతను కిడ్నాప్ విషయంలో ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శ్వేత ఆచూకీ ఇంకా తెలియలేదు.. రెండు టీంలుగా విడిపోయి శ్వేతకోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని నర్సంపల్లిలో బుధవారం ప్రేమించు పెళ్లి చేసుకున్న శ్వేతను కన్నవాళ్లే కిడ్నాప్ చేశారు. అత్తింట్లో ఉండగా ఇంట్లో చొరబడిన ఆరుగురు వ్యక్తులు ఆమెను బలవంతంగా లాక్కెళ్లారు. అడ్డుకున్న అత్తింటివారిని చితకబాదారు. దీంతో శ్వేత భర్త ప్రవీణ్, మామ, అత్త కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు.
►ALSO READ | రూ. 18 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన అసిస్టెంట్ ఇంజనీర్..
గురువారం వరకు శ్వేత ఆచూకీ తెలియకపోవడంతో భర్త ప్రవీణ్, అతని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు కీసర్ పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. శ్వేత తండ్రితో ఫోన్లో మాట్లాడిన పోలీసులు .. శ్వేత క్షేమంగానే ఉందని తెలిపారు. అయితే తమ కోడలిన తమకు అప్పగించాలని శ్వేత అత్తామామలు, భర్త ప్రవీణ్ పోలీసులను కోరారు.