అప్పులు బాధతో అన్నదాతల ఆత్మహత్య

అప్పులు బాధతో అన్నదాతల ఆత్మహత్య

జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలంలో విషాదం చోటు చేసుకుంది. సుబ్బక్కపల్లికి చెందిన రవీందర్ రావు అనే రైతు ఆత్మహత్యకు చేసుకున్నాడు. ఉన్న రెండెకరాల భూమిలో అప్పులు చేసి పెట్టుబడి పెట్టి మిర్చి పంటను సాగు చేశాడని కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే పంట కాపుకొచ్చే సమయానికి మిర్చిపంటకు తామరతెగులు సోకింది. దీంతో పంట దిగుబడి రాదని.... అప్పులు తీర్చలేనన్న మనో వేదనతో చేను దగ్గరే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంటి పెద్దదిక్కును కోల్పోవడంతో దీంతో రవీందర్ రావు కుటుంబం రోడ్డున పడింది. కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.

మరోవైపు యాదాద్రి జిల్లాలో మరో రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వలిగొండ మండలం ముద్దాపురం గ్రామంలో  బడక నరసింహ  (40 ) ఆర్థిక ఇబ్బందులతో రాత్రి వ్యవసాయ బావి వద్ద ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో అతని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రామన్నపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

For More News..

ఒమిక్రాన్ కు మరో మూడు​ కొత్త లక్షణాలు

కల్లు గీస్తూ గీత కార్మికుని మృతి