అబ్దుల్లాపూర్‌‌మెట్‌లో దారుణం: భర్తకు మద్యం తాగించి భార్యపై అత్యాచారం, హత్య

అబ్దుల్లాపూర్‌‌మెట్‌లో దారుణం: భర్తకు మద్యం తాగించి భార్యపై అత్యాచారం, హత్య

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌‌మెట్ మండలం తారమతి పేట్ గ్రామంలో దారుణం జరిగింది. భర్తకు మద్యం తాగించి భార్యపై అత్యాచారం చేశారు అదే గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు. ఆ తర్వాత ఆమెను హత్య చేశారు.  దీనిపై పోలీసులకు సమాచారం అందిన వెంటనే ఘటన స్థలానికి చేరుకున్నారు. క్లూస్ టీం,డాగ్ స్క్వాడ్‌తో ఆధారాలు సేకరించి, దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే సురేష్ అనే నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శ్రీకాంత్ అనే మరో నిందితుడు పరారీలో ఉన్నాడు. అతడి కోసం గాలింపు చేపడున్నామని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని, ఇది మద్యం మత్తులో జరిగిందా? ప్రీ ప్లాన్డ్‌గా చేశారా అన్న దానిపైనా విచారణలో తేలాల్సి ఉందని పేర్కొన్నారు.