కేరళలో నోరో వైరస్ కలకలం

కేరళలో నోరో వైరస్ కలకలం

కేరళలో నోరో వైరస్ కలకలం సృష్టిస్తోంది. తిరువనంతపురంలో ఇద్దరు పిల్లలకు నోరో వైరస్ సోకిందని కేరళ వైద్యాధికారులు ధృవీకరించారు. అంటువ్యాధి అయిన నోరో వైరస్ రోటవైరస్ తరహాలోనే ఉంటుంది. ఈ వైరస్ సోకిన పిల్లలకు సరైన సమయంలో ట్రీట్మెంట్ చేయకపోతే ప్రాణాంతకంగా మారుతుందని డాక్టర్లు చెబుతున్నారు. కలుషిత నీరు, ఆహారం ద్వారా వైరస్ వ్యాప్తి చెందే అవకాశముండటంతో అధికారులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. ప్రజలు నీరు, ఆహారంతో పాటు పరిశుభ్రతకు  ప్రాధాన్యత ఇవ్వాలని కేరళఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జి చెప్పారు. ప్రస్తుతం నోరో వైరస్ సోకిన పిల్లల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని చెప్పారు.

నోరోవైరస్ వ్యాప్తికి ఫుడ్ పాయిజనింగ్ కారణం కావచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. స్కూల్లో మధ్యాహ్న భోజనం చేసిన తర్వాత పిల్లల్లో వైరస్ లక్షణాలు కనిపించాయని అంటున్నారు. 2021 నవంబర్లో కేరళలోని ఓ వెటర్నరీ కాలేజీలో 30 మంది విద్యార్థులకు నోరో వైరస్ సోకింది. నోరో వైరస్ సోకిన రోగులు వాంతులు,విరేచనాలు, తలనొప్పి, ఒంటి నొప్పులతో బాధపడుతుంటారు. 

మరిన్ని వార్తల కోసం..

దేశంలో వరుసగా రెండో రోజూ 4 వేలకుపైగా కరోనా కేసులు

క్షమాపణ చెప్పాల్సింది బీజేపీ... దేశం కాదు