అమెరికాలో 70 ఏళ్ల తరువాత మహిళకు మరణశిక్ష

అమెరికాలో 70 ఏళ్ల తరువాత మహిళకు మరణశిక్ష

వాషింగ్టన్​: ప్రెగ్నెంట్​ను చంపి, ఆమె బిడ్డను తీసుకొని పారిపోయిన మహిళకు మరణశిక్ష అమలుకు ఆఫీసర్లు ఏర్పాట్లు పూర్తి చేశారు. అమెరికాలో ఒక మహిళకు మరణశిక్ష అమలు చేయడం 70 ఏళ్లలో ఇదే మొదటిసారి. దోషి లీజా మోంట్​గోమరినీ ఇండియా టెర్​ హట్​లోని ఫెడరల్ కరెక్షనల్​ కాంప్లెక్స్​లో విషపు ఇంజక్షన్ ఇచ్చి శిక్షను అమలు చేస్తారు. ఈమె 2004 డిసెంబరులో లీజా బాబీ జో స్టినెట్​అనే ప్రెగ్నెంట్​ను గొంతు పిసికి చంపింది. ఆమె కడుపును కోసి బిడ్డను తీసుకొని పారిపోయింది. మరునాడే పోలీసులు ఈమెను అరెస్టు చేశారు. స్టినెట్​ కూతురి వయసు ఇప్పుడు 16 ఏళ్లని పోలీసులు ప్రకటించారు. అనారోగ్య సమస్యల కారణంగా లీజాకు సంతానం కలిగే అవకాశం లేకపోవడంతో ఈ దారుణానికి పాల్పడిందని చెప్పారు. అయితే మానసిక అనారోగ్యం వల్లే ఆమె ఈ హత్య చేసిందన్న డిఫెన్స్​ లాయర్ల వాదనను కోర్టు ఒప్పుకోలేదు.