వామ్మో.. డ్రైవింగ్ టెస్ట్ కోసం 1600 కి.మీ. ప్రయాణమా.!

వామ్మో.. డ్రైవింగ్ టెస్ట్ కోసం 1600 కి.మీ. ప్రయాణమా.!

ఓ మహిళ డ్రైవింగ్ టెస్టకోసం 1600 కిలోమీటర్లు డ్రైవింగ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.  యూకేకు చెందిన ఎమిలీ డోయిల్ (22)  డ్రైవింగ్ లైసెన్స్ పొందేందుకు టెస్ట్ కోసం వందలాది కిలోమీటర్లు  వెళ్లారు.   ఆన్ లైన్ లో స్లాట్ బుకింగ్ అందుబాటులో లేనందున అంత దూరంలోని ఆర్టీఓ కార్యాలయానికి వెళ్లాల్సి వచ్చిందని డోయిల్ తెలిపింది.  డ్రైవింగ్ లైసెన్స్ పొందేందుకు రాత పరీక్షలో అర్హత సాధించిన తరువాత డ్రైవింగ్ టెస్ట్ కోసం యూకేలో ఓ మహిళ బెర్క్‌షైర్‌లోని విండ్సర్‌ నుంచి ఈశాన్య స్కాట్‌లాండ్‌లోని అబెర్డీన్ నగరానికి వెళ్లాల్సి వచ్చింది.   

ఎమిలీ అనే మహిళా విద్యార్థిని  డ్రైవింగ్ లైసెన్స్ కోసం నిర్వహించే రాత పరీక్షలో ఏప్రిలో లో ఉత్తీర్ణురాలైంది.  అయితే ఆ తరువాత బెర్క్‌షైర్‌లోని తన ఇంటికి సమీపంలోని ఏ ఆర్టీఓ కార్యాలయంలో కూడా డ్రైవింగ్ టెస్ట్ ఆన్ లైన్ లో  టైం స్లాట్ బుకింగ్ లభించలేదు.  దీంతో ఆ మహిళ ఇతర ప్రదేశానికి వెళ్లాల్సి వచ్చింది.  ఈశాన్య స్కాట్‌లాండ్‌లోని అబెర్డీన్ నగరంలో డ్రైవింగ్ టెస్ట్ కోసం 1600 కిలోమీటర్లు వెళ్లాల్సి వచ్చిందని ఆమె తెలిపింది.  తనకు దగ్గరలోని ఆర్టీఓ కార్యాలయంలో డ్రైవింగ్ టెస్ట్ కోసం ఆన్ లైన్ లో టైం స్లాట్ బుక్ చేసుకొనేందుకు ఏడాది కాలం పాటు ఎదురు చూశానని కాని తనకు టైం స్లాట్ బుక్ కాలేదని తెలిపింది.  

ఎమిలీ తండ్రి ఈ పరిస్థితి చాలా విపరీతంగా ఉందని తెలిపారు. ఈ విషయంలో  డ్రైవర్ అండ్ వెహికల్ స్టాండర్డ్స్ ఏజెన్సీ (DVSA) ప్రతినిధి స్పందించారు.  డ్రైవింగ్ టెస్ట్ వెయిటింగ్ టైమ్స్ తగ్గించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇప్పటికే ప్రతినెల కూడా టైం స్లాట్ తో సంబంధం లేకుండా రద్దీని దృష్టిలో పెట్టుకొని 40 వేల అదనపు పరీక్షలు నిర్వహిస్తు్న్నామని తెలిపారు. డ్రైవింగ్ టెస్ట్ ను బుక్ చేసుకొనేవారికి త్వరగా స్లాట్ బుక్కయ్యేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.