మూడో కూటమితో మాకేం నష్టం లేదు

మూడో కూటమితో మాకేం నష్టం లేదు

ముఖ్యమంత్రి కేసీఆర్ కూటమి ఏర్పాటు ప్రయత్నాలపై విపక్ష నేతల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కూటమితో ఒరిగేదేమీ లేదని కొందరు ఎన్డీఏ పక్ష నేతలు అభిప్రాయపడుతుండగా.. బీజేపీకి ప్రత్యామ్నాయ కూటమి అవసరమేనని మరికొన్ని పార్టీల నేతలు అంటున్నారు.

దేశంలో మూడో కూటమి ఏర్పడినా తమకు వచ్చిన నష్టమేమీ లేదని  కేంద్రమంత్రి, ఎన్డీఏ భాగస్వామ్య పక్షనేత రాందాస్ అథవాలే అన్నారు. కేసీఆర్ కూటమి కేవలం తెలంగాణకే పరిమితమవుతుందన్నారు.

ఫెడరల్ స్పూర్తికి విరుద్ధంగా కేంద్రం వ్యవహరిస్తుండటం వల్లే కొత్త కూటమి ఏర్పాటు ప్రయత్నాలు జరుగుతున్నాయని సీపీఐ నేత  రాజా అన్నారు. కేంద్ర ప్రభుత్వం గవర్నర్ ఆఫీసులతో రాజకీయం చేయించాలని చూస్తోందని.. దీనిని అడ్డుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.

కాంగ్రెస్ తో కలిసి వెళ్లాలనే కేసీఆర్ నిర్ణయించుకున్నారని రాష్ట్ర బీజేపీ నేత రాంచందర్ రావు అన్నారు. అయితే కూటమిని ఎవరు లీడ్ చేస్తారనేదే ఇప్పటి వరకు క్లారిటీ రాలేదన్నారు. ఇలాంటి కూటములను ప్రస్తుతం ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు.

సీఎం కేసీఆర్ ముంబై టూర్ పై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ స్పందించారు. బీజేపీ ప్రజావ్యతిరేక విధానాలతో ప్రజలు విసిగిపోయారని.. ఇలాంటి పరిస్థితిలో ఓ కూటమి అవసరమేనన్నారు. ఆ దిశగానే కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారన్నారు.

జాతీయ రాజకీయాలంటూ కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలు ఫలించవని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. అనవసరమైన ప్రయత్నాలు చేసి కేసీఆర్ చరిత్రహీనుడిగా మిగిలిపోవద్దన్నారు. యువత చత్రపతి శివాజీ అడుగుజాడల్లో పయనించాలని పిలుపునిచ్చారు. శివాజీ జయంతి వేడుకలకు ప్రభుత్వం అడ్డంకులు సృష్టించడంపై రఘునందన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శివాజీ తెగువను భవిష్యత్ తరాలకు అందించాల్సిన అవసరం ఉందన్నారు.

మరిన్ని వార్తల కోసం..

బయ్యారం స్టీల్ ప్లాంట్పై కేంద్రానికి కేటీఆర్ లేఖ

బ్రిటన్ రాణికి కరోనా పాజిటివ్

ప్రధాని ఎవరన్నది తర్వాత తేల్చుకుంటాం