అమెరికా అధ్యక్షుడు ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడోనని ప్రపంచ దేశాలు బిక్కుబిక్కుమంటున్నాయి. ఆయన రెండో సారి అధ్యక్షుడైన దగ్గరి నుంచి రోజుకొక సంచలన నిర్ణయం తీసుకుంటున్నారు. ఇప్పటి వరకు అమెరికాలో ఉద్యోగాల విషయంలో సంచలన నిర్ణయాలు తీసుకున్న ట్రంప్..ఇప్పుడు మరో అడుగు ముందుకేసి.. ఓ 12 దేశాల ప్రజలను మీరు.. మాదేశంలోకి రావద్దని.. ఆదేశాల ప్రజలకు అమెరికాకు నో ఎంట్రీ అని ప్రకటించారు. మరో 7 దేశాలకు కఠినమైన ఆంక్షలను విధించారు.
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి బాధ్యతలు తీసుకున్న దగ్గరి నుంచి ప్రతిరోజు ఏదో ఒక సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఆయన తీసుకున్న నిర్ణయాలు యావత్ ప్రపంచాన్ని ప్రభావితం చేస్తున్నాయి. తాజాగా 12 దేశాలకు చెందిన ప్రజలు తమ దేశానికి రావద్దని.. ఏడు దేశాల ప్రజలకు కఠినమైన ట్రాన్స్పోర్ట్ ఆంక్షలు విధించారు. అమెరికా జాతీయ భద్రతా వ్యవహారాల రీత్యా ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని వైట్‌హౌస్ తెలిపింది.

"We cannot have open migration from any country where we cannot safely and reliably vet and screen... That is why today I am signing a new executive order placing travel restrictions on countries including Yemen, Somalia, Haiti, Libya, and numerous others." –President Trump pic.twitter.com/ER7nGM4TO2
— The White House (@WhiteHouse) June 4, 2025

అమెరికాకు రాకుండా పూర్తిగా నిషేధించబడిన దేశాలు
- ఆఫ్ఘనిస్తాన్
- మయన్మార్
- చాడ్
- కాంగో రిపబ్లిక్
- ఈక్వటోరియల్ గినియా
- ఎరిట్రియా
- హైతీ
- ఇరాన్
- లిబియా
- సోమాలియా
- సూడాన్
- యెమెన్
ట్రాన్స్‌పోర్టు రద్దు చేసి కఠినమైన ఆంక్షలు విధించిన దేశాలు
- బురుండి
- క్యూబా
- లావోస్
- సియెర్రా లియోన్
- టోగో
- తుర్క్మెనిస్తాన్
- వెనిజులా
ఈ దేశాల నుండి వచ్చే వ్యక్తులపై ప్రత్యేక షరతులు, కఠినమైన ఆంక్షలను ట్రంప్ విధించారు.
కొలరాడోలోని బౌల్డర్ లో చోటు చేసుకున్న ఉగ్రవాద దాడి నేపథ్యంలో ట్రంప్ ఈ నిర్ణయాన్ని తీసుకోవాల్సి వచ్చిందని వైట్ హౌస్ వెల్లడించింది. కొన్ని దేశాల పౌరుల నుంచి ప్రజలు, దేశ భద్రతకు పెను ముప్పు ఉందని ట్రంప్ భావిస్తోన్నట్లు పేర్కొంది. డొనాల్డ్ ట్రంప్ .. ఇతర దేశాల ప్రజలపై బ్యాన్‌ను గతంలో కూడా విధించారు. తాను గతంలో అధ్యక్షుడిగా ఉన్న కాలంలో ఏడు ముస్లిందేశాల ప్రయాణాన్ని బ్యాన్ చేశాడు. ఈ చర్యను అప్పట్లో ( 2018) లో సుప్రీంకోర్టు కూడా ఆమోదించింది.
►ALSO READ | స్టూడెంట్స్ కు మరో షాక్ ఇచ్చిన ట్రంప్.. హార్వర్డ్ యూనివర్సిటీలో విదేశీ విద్యార్థులకు నో ఎంట్రీ..
రెండోసారి ట్రంప్ అధ్యక్షుడైన తరువాత మళ్లీ ట్రావెల్ బ్యాన్ విధాన్ని అమలుచేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ సారి వలస వీసాలకే కాకుండా మరికొన్ని కఠిన నిర్ణయాలు కూడా తీసుకున్నారు. B-1 (వ్యాపారం), B-2 (పర్యాటకం), F (విద్యార్థి), M (వృత్తి), J (మార్పిడి కార్యక్రమం) వంటి వలసేతర వీసాలకు కూడా వర్తింపచేశారు.

President Trump is fulfilling his promise to protect Americans from dangerous foreign actors that want to come to our country and cause us harm.

These commonsense restrictions are country-specific and include places that lack proper vetting, exhibit high visa overstay rates, or… https://t.co/rr9jgBOzvt
— Abigail Jackson (@ATJackson47) June 4, 2025

అమెరికా మరో యూరప్ గా మారకుండా ఉండేందుకు ఇలాంటి చర్యలు చేపడుతున్నామని డొనాల్డ్ ట్రంప్ వివరించారు. రాడికల్ ఇస్లామిక్ ఉగ్రవాదులు దేశంలోకి ప్రవేశించకుండా నిరోధించడానికి కొంతమంది ‘ట్రంప్ ట్రావెల్ బ్యాన్’ అని పిలిచే ప్రయాణ నిషేధాన్ని మళ్ళీ అమలు చేస్తామని ఆయన అన్నారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాల్లో ఉగ్రవాదులు.. అసాంఘిక శక్తుల వల్ల పలు ప్రమాదాలు జరుగుతున్నాయని.. అందుకే ఇమ్మిగ్రేషన్ నిబంధనలు కఠినతరం చేయాలని నిర్ణయం తీసుకున్నామని వైట్ హౌస్ నుంచి ఒక ప్రకటన వెలువడింది.