
వాషింగ్టన్: చైనా టెలికాం కంపెనీ (అమెరికాస్) కార్పొరేషన్‌ను అమెరికా బహిష్కరించింది. డొమెస్టిక్ ఇంటర్‌స్టేట్, ఇంటర్నేషనల్ సర్వీస్‌లను 60 రోజుల్లో నిలిపేయాలని ఆ కంపెనీని ఫెడరల్ కమ్యూనికేషన్స్ కమిషన్ మంగళవారం ఆదేశించింది. రెండు దేశాల మధ్య టెన్షన్స్ పెరుగుతుండటంతో అమెరికా భద్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. చైనా ప్రభుత్వ యాజమాన్యంలో నడుస్తున్న 3 పెద్ద టెలికాం సంస్థల్లో చైనా టెలికాం (అమెరికాస్) కార్పొరేషన్ ఒకటి. ఈ కంపెనీని చైనా సర్కారే కంట్రోల్ చేస్తోంది. దీని ద్వారా అమెరికాలో గూఢచర్యం, ఇతర ప్రమాదకర కార్యకలాపాలకు చైనా పాల్పడే ప్రమాదం ఉందని అమెరికా భావిస్తోంది. చైనా నుంచి ముప్పు ఉంటుందని భావించిన అప్పటి ట్రంప్సర్కారు.. అమెరికా టెక్నాలజీ, మార్కెట్స్‌ను చైనా కంపెనీలు చేజిక్కించుకోకుండా చర్యలు తీసుకుంటూ వస్తోంది. ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్కూడా దీన్ని కొనసాగిస్తున్నారు. కాగా, తమ కంపెనీలను కాపాడుకుంటామని చైనా చెప్పింది. ఎలాంటి చర్యలు తీసుకోనుందో మాత్రం ఇంకా వెల్లడించలేదు.