
అమెరికా వలసదారుల విషయంలో మరో నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ప్రయోజనాలను ఆశించే వలసదారులకు గ్రీన్‌కార్డును నిరాకరిస్తామని తేల్చి చెప్పింది. అమెరికా పౌరులకు ప్రభుత్వం అందిస్తున్న ప్రయోజనాలను వినియోగించుకోబోమని వలసదారులు కాన్సులర్ ఆఫీసర్‌కు నమ్మకం కలిగించాలి…. అలా చేయకుంటే చట్టబద్దమైన శాశ్వత నివాసాన్ని కల్పించే గ్రీన్‌కార్డును జారీ చేయబోమని స్పష్టం చేసింది. ప్రభుత్వ పథకాలైన ఆహారం, మెడికల్ ట్రీట్ మెంట్, ఇళ్ల కేటాయింపు ప్రయోజనాలను వలసదారులు ఉపయోగించుకున్నట్టు తేలితే వారి గ్రీన్‌కార్డు, వీసా పేపర్ల రద్దు చేయనున్నట్లు వైట్ హౌజ్ చెప్పింది. బయటి దేశం నుంచి వచ్చి ప్రభుత్వ పథకాలపై ఆధారపడకుండా, సొంత ఆదాయంపై జీవించేలా ఈ నిర్ణయం సాయపడుతుందని అధికారులు తెలిపారు.